Home » తెల్ల తెల్ల లుంగీ కట్టీ – జానపద పాట

తెల్ల తెల్ల లుంగీ కట్టీ – జానపద పాట

by Vinod G
0 comments
tella tella lungi katti folk song lyrics

తెల్ల తెల్ల లుంగీ గట్టి ఎటుబోయినావయ్యో
నా బావ నా ముద్దుల బావ
ఎటుబోయినావయ్యో ఓ బావ ఓ ముద్దుల బావ

ఆ పక్క వాడలో పంచాయితైతే సెప్పా నేను బొయిన్నే
ఓ పిల్లో ఓ రాధమ్మ
సెప్పా నేను బొయిననే ఓ పిల్లో ఓ రాధమ్మ

పంచాయి మీద మన్నుబోయ బదనామైతావ్ నా బావ
నా బావ నా ముద్దుల బావ
బదనామైతావ్ ఓ బావ ఓ బావ ఓ ముద్దుల బావ

ఆడిపిల్ల పంచాయితైతే ఆదుకోను బోయిననే
ఓ పిల్ల ఓ రాధమ్మ
సెప్పనేను బోయిననే ఓ పిల్ల ఓ రాధమ్మ

వాడ వాడ జూసినగాని ఏ వాడలో లేవయ్యో
నా బావ నా ముద్దుల బావ
ఏ వాడలో లేవయ్యో ఓ బావ ఓ ముద్దుల బావ

ఆ కోమటోళ్ల వాడలోన కోలాలెయ్యబోయిననే
ఓ పిల్ల ఓ రాధమ్మ
కోలాలెయ్యబోయిననే ఓ పిల్ల ఓ రాధమ్మ

కనులమీద మన్నెపొయ్య కోట్లాటోస్తది నా బావ
నా బావ నా ముద్దుల బావ
కోట్లాటోస్తది ఓ బావ ఓ బావ ఓ ముద్దుల బావ

కోలాలెయ్య నేనెబోతే కొట్లాటేమి లేదమ్మో
ఓ పిల్లో ఓ రాధమ్మ
అట్లాంటోన్నిగాదమ్మ ఓ పిల్లో ఓ రాధమ్మ

పట్టాపగలు తిండికి రాక యాడనున్నవు నా బావ
నా బావ నా ముద్దుల బావ
యాడనున్నవు ఓ బావ ఓ బావ ఓ ముద్దుల బావ

ఆ పక్కవాడ సుట్టాపోళ్ల పండుగుంటే బొయిన్నే
ఓ పిల్లో ఓ రాధమ్మ
పండుగుంటే బొయిన్నే ఓ పిల్లో ఓ రాధమ్మ

ఆ పండుగకు నేనే వస్తే జాడ నీది లేదయ్యొ
నా బావ నా ముద్దుల బావ
యాడవున్నావు సెప్పయ్యో ఓ బావ ఓ ముద్దుల బావ

ఆ ఇంటి యనక బంతితోట ఉందిగదా జూడమ్మో
ఓ పిల్ల ఓ రాధమ్మ
తోటలోనే ఉన్నానే ఓ పిల్ల ఓ రాధమ్మ

సందెపొద్దు గూకాబట్టే యాడనున్నావు నా బావ
నా బావ నా ముద్దుల బావ
యాడవున్నావు సెప్పయ్యో ఓ బావ ఓ ముద్దుల బావ

ఆ బాపనోరి వాడలోన భజన చేయ బొయిన్నే
ఓ పిల్ల ఓ రాధమ్మ
భజన చేయ బొయిన్నే ఓ పిల్ల ఓ రాధమ్మ

భజనకు నువ్వేబోతే బదనామైతావ్ నా బావ
నా బావ నా ముద్దుల బావ
బదనామైతావ్ ఓ బావ ఓ బావ ఓ ముద్దుల బావ

భజన చేయ నేనెబోతే బదనామేమి గాదమ్మో
ఓ పిల్ల ఓ రాధమ్మ
బదనామేమి గాదమ్మో ఓ పిల్ల ఓ రాధమ్మ

నట్టానడుమ రాతిరాయ ఇప్పుడేమి పనయ్యో
నా బావ నా ముద్దుల బావ
ఇప్పుడేమి పనయ్యో ఓ బావ ఓ ముద్దుల బావ

నా దోస్తూగాని దావతుంటే ధావతికి బొయిన్నే
ఓ పిల్ల ఓ రాధమ్మ
ధావతికి బొయిన్నే ఓ పిల్ల ఓ రాధమ్మ

అనుమానమైతే గాదు బావ ఎట్లా ఒక్క దాన్నయ్యో
నా బావ నా ముద్దుల బావ
ఎట్లా ఒక్క దాన్నయ్యో ఓ బావ ఓ ముద్దుల బావ

హ గడపా దాటాక ముందే నీతో ముచ్చటిస్తాలేవమ్మో
ఓ పిల్ల ఓ రాధమ్మ
కొంచం నవ్వరాదమ్మ ఓ పిల్ల ఓ రాధమ్మ


👉 ఇంకా ఇలాంటి లేటెస్ట్ పాటలు కావాలంటే తెలుగురీడర్స్ ని ఫాలో అవ్వండి ! అలాగే మీకు నచ్చిన పాట ఏదైనా ఉంటే కామెంట్లో పేరు చెప్పండి – మేము దాన్ని త్వరగా మీకు అందించే ప్రయత్నం చేస్తాం!

You may also like

Leave a Comment

About us

మేము తెలుగు వారికోసం, తెలుగులో తెలుగుని చదివే వారి కోసం, వారికి తెలుగు మీద వున్నా అభిమానాన్ని చూపించడానికి ఒక అంతర్జాల విశ్లేషణ ప్రదేశమును సృష్టించినాము. అదే తెలుగు రీడర్స్ అను ఈ ప్రదేశములో మేము మీకు కావాల్సిన కథలు, విశ్లేషణలు, పాటల రచనలు (గేయ రచనలు), చూడవలసిన ప్రదేశాలు, తెలుసుకోవలసిన సాంకేతిక పరిజ్ఞానం, చలన చిత్ర విశేషాలతో ఈ మా తెలుగు రీడర్స్ ని నింపి వున్నాము. మీకు ఎటువంటి ఇబ్బందులు వున్నా మామ్మాల్ని సంప్రదించండి ప్రక్కన వున్నా అనుసంధాన అంతర్జాల వనరుని నొక్కండి. తెలుగు రీడర్స్ ని సంప్రదించండి.

@2025 – All Right Reserved. Designed and Developed by MrPKP.