నవ్వడం అనేది నిజంగా ఆరోగ్యకరమైన చర్య. ఎందుకంటే నవ్వుతూ ఉంటే మనసును సంతోషంగా మరియు శాంతిగా ఉంచుకోవచ్చు. ఇంకా ఎటువంటి ఖర్చు లేకుండా ఎన్నో రకాల ఆరోగ్య సమస్యలను నివారించుకోవచ్చు. నవ్వడం ఒక భోగం అని, నవ్వించడం ఒక యోగం అని, నవ్వలేకపోవడం ఒక రోగం అని పెద్దలు అంటారు. చాలామంది రోజు మొత్తంలో పని ఒత్తిడి బిజీ లైఫ్ కారణంగా నవ్వడమే మరచిపోతున్నారు. కాలిఫోర్నియాలో చేసిన ఒక పరిశోధనలో నవ్వడం వల్ల ఆరోగ్యానికి అనేక లాభాలు ఉన్నాయని తేలింది. వాటి గురించి ఇక్కడ మనము పరిశీలిద్దాం.
- నవ్వడం వల్ల రక్తపోటు నియంత్రణలో ఉంటుందట. ఇంకా గుండెపోటు వచ్చే అవకాశాలు కూడా తగ్గుతాయట.
- మీరు ఒత్తిడిలో వున్నప్పుడు బాగా నవ్విచూడండి మంచి ఉపశమనం కలుగుతుంది.
- బాగా నవ్వడం వలన మీ పొత్తి కడుపు, ముఖంలోని కండరాలకు చక్కని వ్యాయామం లభిస్తుందట. దీనివలన ఆరోగ్యానికి ఎంతో మేలు కలుగుతుందట.
- అంతే కాదండోయ్ నవ్వడం వలన రోగనిరోధక వ్యవస్థలో భాగమైన టి – సెల్స్ కూడా వృద్ధి చెందుతాయట.
- అదే విధంగా మనం నవ్వినప్పుడు శరీరంలో ఏండో ఫిరమోస్ అనే రసాయనం విడుదల అవుతుందట. ఇది బాడీలో నాచురల్ పెయిన్ కిల్లర్ లాగా పనిచేస్తుందట.
- నవ్వడం వల్ల గుండె కూడా ఆరోగ్యంగా ఉంటుందట.
చూసారా నవ్వడం వలన ఎన్ని ఆరోగ్యప్రయోజనాలు కలుగుతున్నాయో! కాబట్టి ప్రతి రోజు నవ్వడానికి కొంత సమయం కేటాయించండి. స్నేహితులతో జోక్స్ వేయండి. నవ్వు తెప్పించే వీడియోస్, కామెడీ షోస్ చూడండి. అలాగే మీ మనసుకు ఇష్టమైన పనులు చేయండి.
ఇలాంటి మరిన్ని వాటి కొరకుతెలుగు రీడర్స్ టిప్స్ను సందర్శించండి.