తు మేర లవరు లవరు లవరే
తుజుకో దియా ఫ్లవరే
తు మేర లవరు లవరు లవరే
పెట్టావే చెవిలో క్యాలిఫ్లవరే
నీలాగే నచ్చలేదె గిచ్చలేదు ఎవ్వరు
చొక్కాలే చింపుకోరే నాకు లాగ అందరు
నువ్వేమో తులసి కోట లోన గాంజా ఫ్లేవరు
మీ బాబు నిన్ను మించి ఇంకా పెద్ద లోఫరు
పైకేమో స్కాచు బాటిల్ లాగ నువ్వు సూపరు
నీ మైండు చూడబోతే ఛీపు లిక్కరు
నా గొంతు కొస్తివే దొంగ టీచరు
తు మేర లవరు లవరు లవరే
తుజుకో దియా ఫ్లవరే
తు మేర లవరు లవరు లవరే
పెట్టావే చెవిలో క్యాలిఫ్లవరే
ఓసోసి జింకా పరుగెత్తకింకా
నీ తీగ లాగి పట్టేసా డొంక
నీలాంటి పిల్ల ఉంటే ప్రతి జిల్లా
కొల్లేరైపోదా తెల్లారేకెల్లా
నిన్నెన్ని బండబూతులు తిట్టుకున్నా తప్పులేదే
నా ఉసురే నీకు తగిలి జిందగీలో పెళ్లి కాదే
నీకోసం పడిచస్తుంటే నా కంట్లోనే కారాన్ని కొట్టావ్ కదే
తు మేర లవరు లవరు లవరే
తుజుకో దియా ఫ్లవరే
తు మేర లవరు లవరు లవరే
పెట్టావే చెవిలో క్యాలిఫ్లవరే
నీ అందం చూసి నే పడిపోలేదే
ఎదో ఉహించి లవ్ చెయ్యలేదే
మా అబ్బాయిలంతా చెడ్డోలేం కాదే
అమ్మాయిలంతా మంచోళ్ళు కాదే
నువ్వు అట్ట కళ్ళలోకి కళ్ళు పెట్టి సూడమాకే
నీ మీద కోపమంతా తగ్గిపొద్ది నవ్వమాకే
నట్టింట్లో కాలే పెట్టి రమ్మంటుంటే
నట్టేట్లో తోశావ్ కదే
తు మేర లవరు లవరు లవరే
తుజుకో దియా ఫ్లవరే
తు మేర లవరు లవరు లవరే
పెట్టావే చెవిలో క్యాలిఫ్లవరే
పాట పేరు: తు మేర లవర్ (Tu Mera Lover)
సినిమా పేరు: మాస్ జాతర (Mass Jathara)
గానం: చక్రి గారు (AI Voice)
సాహిత్యం: భాస్కరభట్ల రవి కుమార్ (Bhaskarabhatla Ravi Kumar)
సంగీతం: భీమ్స్ సిసిరోలియో (Bheems Ceciroleo)
తారాగణం : రవితేజ (Ravi Teja), శ్రీ లీల (Sreeleela)
రచయిత & దర్శకుడు: భాను బోగవరపు (Bhanu Bogavarapu)
👉 మరిన్ని పాటల కోసం తెలుగు రీడర్స్ లిరిక్స్ చూడండి