దర్శనమే మధుర క్షణమే
నీవు నేను ఇక మనమే
మనసున మోగే మంగళ నాద స్వరమే
నా దాక నిన్నూ నడిపింది ప్రేమే
నువ్వుఇలా జతగా నడిచే ప్రతి అడుగు పూల వనమే
నీతో పరిచయమే పరిచయమే ప్రియవరం
ఇక నీతో ప్రతి నిమిషం పరవశమే నాకు
నీతో పరిచయమే పరిచయమే ప్రియవరం
ఇక నీతో ప్రతి నిమిషం పరవశమే నాకు
నీ పెదాలకు మెరుపైన ఎరుపు నేనే
నీ పదాలకు సిరి సిరి మువ్వనైన నేనే
నీ నీలి ముంగురుల ఉయ్యాలలుగానే
నీ వేలి ఉంగరమై వెయ్యేళ్ళు నావేనే
నీ చూపు నేనే నీ రేపు నేనే
నీ యదలో కదిలే మెదిలే ఆశ ఒడైన నేనే
నీతో పరిచయమే పరిచయమే ప్రియవరం
ఇక నీతో ప్రతి నిమిషం పరవశమే నాకు
రాసి ఇవ్వన నా నవ్వులన్నీ నీకే
స్వీకరించనా నీ ప్రతి కంటి చమ్మ నాకే
నా జంట నువ్వుంటే వెన్నెల మధుమాసం
నీ తోడు లేకుంటే వేసంగి వనవాసం
ఆ రామ సీత నా ప్రేమ గీత
నువ్వుఇలా జతగా నిలిచి నా కలలు పండేనంట
దర్శనమే మధుర క్షణమే
నీవు నేను ఇక మనమే
దర్శనమే మధుర క్షణమే
మనసున మోగే మంగళ నాద స్వరమే
నా దాక నిన్నూ నడిపింది ప్రేమే
నువ్వుఇలా జతగా నడిచే ప్రతి అడుగు పూల వనమే
నీతో పరిచయమే పరిచయమే ప్రియవరం
ఇక నీతో ప్రతి నిమిషం పరవశమే నాకు
నీతో పరిచయమే పరిచయమే ప్రియవరం
ఇక నీతో ప్రతి నిమిషం పరవశమే నాకు
పాట పేరు: దర్శనమే (Darsanamey)
సినిమా పేరు: నారీ నారీ నడుమ మురారి (Nari Nari Naduma Murari)
గానం: యాజిన్ నిజార్ (Yazin Nizar)
సాహిత్యం: రామజోగయ్య శాస్త్రి (Ramajogayya Sastry)
సంగీతం: విశాల్ చంద్రశేఖర్ (Vishal Chandrashekhar)
రచయిత & దర్శకుడు: రామ్ అబ్బరాజు (Ram Abbaraju)
👉 మరిన్ని పాటల కోసం తెలుగు రీడర్స్ లిరిక్స్ చూడండి