Home » Gopikamma Song Lyrics | Mukunda

Gopikamma Song Lyrics | Mukunda

by Nikitha Kavali
0 comments
Gopikamma Song Lyrics

Gopikamma Song Lyrics In Telugu:

గోపికమ్మ చాలును లేమ్మా నీ నిదర
గోపికమ్మ నిను వీడనీమ్మ మంచు తెర
విరిసిన పూ మాలగా వెన్నుని ఎద వాలాగా
తలుపును లేపాలిగా బాల
పరదాలే తీయక పరుపే దిగనీయక
పవళింప ఇంకా జా మేర
కడవల్లో కవ్వాలు సడి చేస్తున్న వినక
గడపలో కిరణాలు లేలేమన్న కదలక
కలికి ఈ కునుకెలా తెల్లవార వచ్చేనమ్మా
గోపికమ్మ చాలును లేమ్మా నీ నిదర
గోపికమ్మ నిను వీడనీమ్మ మంచు తెర

నీ కలలన్ని కల్లలై రాతిరిలో కరగవని
నువ్వు నమ్మేలా ఎదురుగ నిలిచెనే కన్యామని
నీ కోసమని గగనమే భువి పైకి దిగి వచ్చేనని
ఆ రూపాన్ని చూపుతో అల్లుకుపో సౌదామిని
జంకేల జాగేల సంకోచాల జవ్వని
బింకాలు బిడియాలు ఆ నల్లనయ్య చేత చిక్కి
పిల్లనా గ్రోవయి ప్ప్రియామారా నవరాగాలేయ్ పాడనీయ
అంటూ ఈ చిరుగాలి నిను మేలుకొలుపు సంబరాన
గోపికమ్మ చాలును లేమ్మా నీ నిదర
గోపికమ్మ నిను విడనీమ్మ మంచు తెర

యేడే అల్లరి వనమాలి నను వీడే మనసున దయమాలి
ఈ నంద కుమారుడు మురళి లోలుడు నా గోపాలుడు ఏడే ఏడే
లీల కృష్ణ కొలిమిలో కమలములు కన్నెమది
తనలో తృష్ణ తేనెల విందిస్తానంటున్నది
అల్లరి కన్నా దోచుకో కమ్మని ఆశల వెన్న ఇది
అందరికన్నా ముందుగా తన వైపే రమ్మన్నది
విన్నావా చిన్నారి ఏమందో ప్రతి గోపిక
చూస్తూనే చేయి జారే ఈ మంచి వేళా మించనీక
త్వరపడవమ్మా సుకుమారి ఏమాత్రం ఏమరక
వదిలేవో వయ్యారి బృందావిహరి దొరకడమ్మ
గోపికమ్మ చాలును లేమ్మా నీ నిదర
గోపికమ్మ నిను వీడనీమ్మ మంచు తెర
గోపికమ్మ చాలును లేమ్మా నీ నిదర
గోపికమ్మ నిను వీడనీమ్మ మంచు తెర

Gopikamma Song Lyrics In English:

Gopikamma chalunu lemma nee nidhara
Gopikamma ninnu vidaneema manchu thera
Virisina poomaalaga Vennuni yeda vaalaga
Thalapunu lepaliga Bala
Paradhale theyaka parupe dhiganeayaka
Pavalimpa inthaga Mela

Kadavallu kavvalu sadi chesthuna vinaka
Gadapallo kiranalu lelemmanna kadhalaka
Kaliki ee kunukela
Thellavara vachenamma
Gopikamma chalunu lemma nee nidhara
Gopikamma ninnu vidaneemma manchu thera

Nee kalalanni
Kallalai raathirilo karagavani
Nuvvu nammela
Yedhuruga nilichene kanyamani
Neekosamani
Gaganame bhuvipaiki dhigi vacchenani
Aa Roopanni
Chuputho allukupo soudhamini
Jankela jaagela sankochala javvani
Binkalu bidiyalu
Aa nallanayya chetha chikki
Pillana grovai priyamara
Nava raagale paadani
Antu ee chirugali
Ninnu melukolupu sambaraanna

Gopikamma chalunu leemma nee nidhara
Gopikamma ninnu vidaneemma manchu thera

Yede allari vanamali nannu
Veede manasuna dayamaali
Nandha kumarudu murali loludu
Naa gopaludu yede yede
Leela krishna
Kolamilo kamalamula kanne madhi
Thanalo thrushna
Thenela vindhisthanantunnadhi
Allari kanna
Dhochuko kammani aasala venna idhi
Andharikanna
Mundhuga thana vaipe rammannadi
Vinnava chinnari yemandho prathi gopika
Chusthune cheyjari
Ee manchi vela minchanika
Twarapadavamma sukumari
Yemathram yeemaaraka
Vadhilavo vayyari
Brundhavihari dorakadamma

Gopikamma chalunu leemma nee nidhara
Gopikamma ninnu vidaneemma manchu thera
Gopikamma chalunu leemma nee nidhara
Gopikamma ninnu vidaneemma manchu thera

Song Credits:

Song Name : Gopikamma (గోపికమ్మ)
Movie Name : Mukunda (ముకుంద)
Banner : Leo Productions
Producer : B.Madhusudhana Reddy (బి . మధుసూదన రెడ్డి)
Director : Srikanth Addala (శ్రీకాంత్ అడ్డాల)
Cast : Varun Tej ),Pooja Hegde (పూజ హెగ్డే)
Music : Mickey.J.Meyer (మిక్కీ.జె . మేయర్)
Lyrics : Sirivennela Sitarama Sastry (సిరివెన్నెల సీతారామ శాస్త్రి)
Singer : Chitra (చిత్ర)

మరిన్ని వాటి కోసం తెలుగు రీడర్స్ లిరిక్స్ ను సందర్శించండి.

You may also like

Leave a Comment

@2025 – All Right Reserved. Designed and Developed by MrPKP.