గుండే ఒక్కటే.. ఎన్ని గురుతులో
బ్రతికి ఉండడం సాధ్యమా…
మరచిపోవడం మరణమా…
చిన్ని మనసులో ఎన్ని బాధలో
నీలి నీలి కళ్ళలో….
ఎదురు చూపులే జల్లులో..
నువ్వు పంచిన నవ్వు ఎన్నడో…
నీతో పాటు నన్నే వదిలి
ఏటో వెళ్లిపోయిందో..
నువ్వే ఇచ్చిన.. మాట ఎన్నడో..
నువ్వే లేని నేనెందుకని మూగబోయెనో..
నీకోసం… ఊపిరొక్కటే మిగిలేనా..
చిన్ని మనసులో ఎన్ని బాధలో
నీలి నీలి కళ్ళలో….
ఎదురు చూపులే జల్లులో..
రంగు రంగు కలలను కన్నా
నిద్దుర కాదు నిజమనుకున్నా
తెల్లవారగానే కలలు కాలిపోయేనా
ప్రాణమంటే నువ్వనుకున్నా
లోకమేది లేదనుకున్నా
నమ్ముకున్న ప్రేమే కథను మార్చివేసేనా
నేల నుండి నింగి నీడ వేరు చేసేనా
నీకోసం… ఊపిరొక్కటే మిగిలేనా..
అందమైన పువ్వుల జంట
ముళ్ళ పొదలో రాలినవంటా
గాయమేది అంటే రాయలేదు ఏ పాట
నువ్వు నేను తిరిగిన చోట
ఒంటరయ్యి పోయెను బాట
జాలి చూపు చూసే గాలి కూడా ప్రతి పూట
వెయ్యి జన్మలైన నీకై వేచి ఉండనా
నీకోసం… ఊపిరొక్కటే మిగిలేనా..
గుండే ఒక్కటే.. ఎన్ని గురుతులో
బ్రతికి ఉండడం సాధ్యమా…
మరచిపోవడం మరణమా…
____________
Song Credits:
గాయకురాలు – మంగ్లీ (Mangli)
సంగీతం – కమ్రాన్ (KAMRAN)
సాహిత్యం – కాసర్ల శ్యామ్ (KASARLA SHYAM)
నేపథ్య గానం – జునైద్ కుమార్ (JUNAID KUMAR)
మరిన్ని ఇటువంటి లిరిక్స్ కోసం తెలుగు రీడర్స్ లిరిక్స్ ను చూడండి.