హేయ్ నించో నించో నించో నించో
సొంత కాళ్ల పైన నువ్వే నించో
వంచో వంచో వంచో వంచో
విధి రాతను చేయితోనే వంచో
ఎంతమంది వచ్చారురా ఎంతమంది పోయారురా
సత్తువే చూపిన వారే చరితై ఉన్నారురా
తెచ్చుకుంది ఏమీలేదు తెసుకెళ్ల ఏదీరాదు
కళ్లతో నువ్వుకుని జీవితం జీవించేద్దాం
వద్దురా వద్దురా వద్దురా భయమన్న మాట వద్దురా
కొట్టరా కొట్టరా కొట్టరా ఓటమిని తరిమి కొట్టరా
దూకరా దూకరా దూకరా నీ మనసుతోనే దూకరా
పాడరా పాడరా పాడరా నీ కీర్తి పాట పాడరా
హేయ్ నించో నించో నించో నించో
సొంత కాళ్ల పైన నువ్వే నించో
వంచో వంచో వంచో వంచో
విధి రాతను చేయితోనే వంచో
కష్టనష్టాలెన్నో వస్తుంటాయి బాధలు కమ్మేస్తాయి
గుండె ధైర్యమే తోడుంటే అవి తోకలు జాడిస్తాయి
రోజు రోజూ నువు బ్రతుకుతోని పోరును చేయాలోయి
పోరులోన నువ్వు గెలిచినావా పండగ అవుతుందోయి
కలతే దూరమెట్టు కలలా దారిని పట్టు
ఎక్కమంటా ఒక్కో మెట్టు లోకమంతా మెచ్చేటట్టు
వేగంగా వేగంగా వేగంగా కాలం కదిలెను వేగంగా
చూడంగా చూడంగా చూడంగా
నీ వయసే పెరిగేను చూడంగా
ఏకంగా ఏకంగా ఏకంగా నీ గమ్యం చేరాలి ఏకంగా
గర్వంగా గర్వంగా గర్వంగా
నీ జెండా ఎగరాలి గర్వంగా
చేయి కాలు రెండూ సక్కంగున్న సోమరిపోతును చూడు
ఎన్ని లోపాలున్నా ఎగిరి దూకే ఈ చిన్నోడిని చూడు
కంప్యూటర్ లాంటి బ్రెయినే ఇచ్చిన దేవుణ్ణి తిట్టెను వీడు
కాలు లేని ఈ కళ్యాణి ఆడే కథాకళి చూడు
నమ్మకం ఉంటే చాలు జాతకం మారేనురా
నిర్భయం నిజాయితీ జయరథ చక్రాలురా
నీదిరా నీదిరా నీదిరా ఇక భవిష్యత్తే నీదిరా
లేదురా లేదురా లేదురా ఇక సరిహద్దే లేదురా
చూడరా చూడరా చూడరా నీ సహనం నీ తోడురా
పాడరా పాడరా పాడరా నీ విజయమొక పాటరా
హేయ్ నించో నించో నించో నించో
సొంత కాళ్ల పైన నువ్వే నించో
వంచో వంచో వంచో వంచో
విధి రాతను చేయితోనే వంచో
_________________
సాంగ్: నించో నించో (Nincho Nincho)
సినిమా :-కాంచన (Kanchana)
నటీనటులు:- రాఘవ లారెన్స్ (Raghava Lawrence), రాయ్ లక్ష్మి (Rai Lakshmi)
సంగీతం:-ఎస్ ఎస్ తమన్ (S S Thaman)
దర్శకుడు:-రాఘవ లారెన్స్ (Raghava Lawrence)
మరిన్ని ఇటువంటి లిరిక్స్ కోసం తెలుగు రీడర్స్ లిరిక్స్ ను చూడండి.