మనసున ఏదో రాగం విరిసెను నాలో తేజం
చెప్పలేని ఏదో భావం నాలో కలిగెలె
సంద్రపు అలాలే పొంగి తీరం తాకే వేళా
మునిగే మనసు అసలు బెదరలేదులే
ఉన్నదీ ఒక మనసు వినదది నా ఊసు
నను విడి వెళ్లిపోవుట నేను చూసానే
తియ్యని స్వప్నం ఇది చెరగని మనో నిధి
కలలో కలలో నను నేనే చూసానే
నాకేం కావలి నేడు ఒక మాట అడిగి చూడు
ఇక నీవే నాకు తోడు అని లోకమనేదెపుడు
నాకేం కావలి నేడు ఒక మాట అడిగి చూడు
ఇక నీవే నాకు తోడు అని లోకమనేదెపుడు
దోసిట పూలు తెచ్చి ముంగిట ముగ్గులేసి
మనసును అర్పించగా ఆశ పడ్డానే
వలదని ఆపు నది ఏదని అడిగే మది
నదిలో ఆకు వాలే కొట్టుకుపోయానే
గరికెలు విరులయ్యే మార్పే అందం
ఎన్నో యుగములుగా వెలిగిన బంధం
ఒక వెండి గొలుసు వోలె ఈ మనసు ఊగేనిపుడు
తొడగాలి వజ్రమల్లె నే మెరియుచుంటి నిపుడు
ఒక వెండి గొలుసు వోలె ఈ మనసు ఊగేనిపుడు
తొడగాలి వజ్రమల్లె నే మెరియుచుంటి నిపుడు
మనసున ఏదో రాగం విరిసెను నాలో తేజం
చెప్పలేని ఏదో భావం నాలో కలిగెలె
సంద్రపు అలలే పొంగి తీరం తాకే వేళా
మునిగే మనసు అసలు బెదరలేదులే
ఉన్నదీ ఒక మనసు వినదది నా ఊసు
నను విడి వెళ్లిపోవుట నేను చూసానే
తియ్యని స్వప్నం ఇది చెరగని మనో నిధి
కలలో కలలో నను నేనే చూసానే
ఒక వెండి గొలుసు వోలె ఈ మనసు ఊగేనిపుడు
తొడగాలి వజ్రమల్లె నే మెరియుచుంటి నిపుడు
_________________
సాంగ్ : మనసున ఏదో రాగం (Manasuna Edho Raagam)
చిత్రం: ఎంతవాడు గానీ (Yenthavadu Gaani)
నటీనటులు: అజిత్ కుమార్ (Ajith Kumar), అనిఖా (Anikha), అనుష్క శెట్టి (Anushka Shetty)
సంగీత దర్శకుడు: హారిస్ జయరాజ్(Harris Jayaraj)
గీత రచయిత: రత్నం (Rathnam)
గాయకులు: చిన్మయి (Chinmayi)
మరిన్ని ఇటువంటి లిరిక్స్ కోసం తెలుగు రీడర్స్ లిరిక్స్ ను చూడండి.