Home » రేపటి రేపటి రేపటి కలా.. సాంగ్ లిరిక్స్ – కౌసల్య కృష్ణమూర్తి 

రేపటి రేపటి రేపటి కలా.. సాంగ్ లిరిక్స్ – కౌసల్య కృష్ణమూర్తి 

by Manasa Kundurthi
0 comments
Repati Kala song lyrics Kousalya Krishnamurthy

రేపటి రేపటి రేపటి కలా..
రెప్పలు దాటినా రేపటి కల..
రెక్కలు సాచినా రేపటి కల..
ఎగరావే అలా

నీలో లేనిడేది లేదు
వృధాపోదు నీ తర్ఫీదు
నిన్ను నువ్వు ఉలివై మలుచుకో
(రేపటి రేపటి)
శ్రమించందే ఏది రాదు
(రేపటి రేపటి)
విశ్రమిస్తే విజయం లేదు
(రేపటి రేపటి)
పట్టుదలతో లక్ష్యం గెలుచుకో (రేపటి రేపటి)

ఇష్టమే నడిపించే ఇంధానం..
నిష్టగా కదలడమే నీ బలం
కష్టమైనా విరమించని గుణం..
గెలిచే లక్షణం
గెలుపుకై ప్రాణలైదూపదం..
ఓటమిని ఒడిస్తూ.. ప్రతి క్షణం
అక్రమిస్తే నీదేగా.. క్రీడ ప్రాంగణం

ఇందాకా.. వచ్చావు కదా
ఇంకొంచెం పర్లేదు పాదా
యుద్ధంలో గాయలే కదా.. రేపటి కథ

రేపటి రేపటి రేపటి కలా..
రెప్పలు దాటినా రేపటి కల..
రెక్కలు సాచినా రేపటి కల..
ఎగరావే అలా

కాలా..

కల.. పరుగులు నేర్పు.. నీలోని కలలకు
అలుపని అంటూ ఏ చోట నిలవకు
విజృంబించు అవకాశమొదలకు.. సదా
సులువాగు.. గెలుపు మార్గాలు వెతకకు
ఇది చాలంటూ.. ఇలా పైన మిగలకు
అవధులు పెంచి.. శిఖరాల అంచుకు పదా
నొప్పి బాధ అన్నీ కచ్చితం..
నిప్పుల్లోనా నడకే జీవితం
సవాళ్ళెన్ని ఎదురైనా సరే.. సుస్వాగతం
నీలో కూడా ఉందొ అద్భుతం
మదించందే రాదే.. అమృతం
వస్తే రాని అంటే లేని.. అవరోధాలు..
గెలుపే అభిమతం

ఇందాకా.. వచ్చావు కదా
ఇంకొంచెం పర్లేదు పాడా
యుద్ధంలో గాయలే కదా.. రేపటి కథ

నీలో లేనిడేది లేదు
వృధాపోదు నీ తర్ఫీదు
నిన్ను నువ్వు ఉలివై మలుచుకో
శ్రమించందే ఏది రాదు
విశ్రమిస్తే విజయం లేదు
పట్టుదలతో లక్ష్యం గెలుచుకో
ఇష్టమే నడిపించే ఇంధానం..
నిష్టగా కదలడమే నీ బలం
కష్టమైనా విరమించని గుణం..
గెలిచే లక్షణం
గెలుపుకై ప్రాణలైదూపదం..
ఓటమిని ఒడిస్తూ.. ప్రతి క్షణం
అక్రమిస్తే నీదేగా.. క్రీడ ప్రాంగణం

రేపటి రేపటి రేపటి కలా..
రెప్పలు దాటినా రేపటి కల..
రెక్కలు సాచినా రేపటి కల..
ఎగరావే అలా

రేపటి రేపటి రేపటి కలా..
రెప్పలు దాటినా రేపటి కల..
రెక్కలు సాచినా రేపటి కల..
ఎగరావే అలా

_____________________

చిత్రం: కౌసల్య కృష్ణమూర్తి (Kousalya Krishnamurthy)
నటి : ఐశ్వర్య రాజేష్ (Aishwarya Rajesh)
గీతరచయిత: రామజోగయ్య శాస్త్రి (Ramajogayya Sastry)
నటుడు : రాజేంద్ర ప్రసాద్ (Rajendra Prasad)
మహిళా గాయని: మనీషా ఈరాబతిని (Manisha Eerabathini)
సంగీతం: ధిబు నినాన్ థామస్ (Dhibu Ninan Thomas)
దర్శకుడు : భీమనేని శ్రీనివాసరావు (Bhimaneni Srinivasa Rao)
పురుష గాయకుడు: స్వరాగ్ కీర్తన్ (Swaraag Keerthan)
నటుడు: కార్తీక్ రాజు (Karthik Raju)

మరిన్ని ఇటువంటి లిరిక్స్ కోసం తెలుగు రీడర్స్ లిరిక్స్ ను చూడండి.

You may also like

Leave a Comment

About Us

మేము తెలుగు వారికోసం, తెలుగులో తెలుగుని చదివే వారి కోసం, వారికి తెలుగు మీద వున్నా అభిమానాన్ని చూపించడానికి ఒక  అంతర్జాల విశ్లేషణ ప్రదేశమును సృష్టించినాము. అదే తెలుగు రీడర్స్ అను ఈ ప్రదేశములో మేము మీకు కావాల్సిన కథలు, విశ్లేషణలు, పాటల రచనలు (గేయ రచనలు), చూడవలసిన ప్రదేశాలు, తెలుసుకోవలసిన సాంకేతిక పరిజ్ఞానం, చలన చిత్ర విశేషాలతో ఈ మా తెలుగు రీడర్స్ ని నింపి వున్నాము. మీకు ఎటువంటి ఇబ్బందులు వున్నా మామ్మాల్ని సంప్రదించండి ప్రక్కన వున్నా అనుసంధాన అంతర్జాల వనరుని నొక్కండి. తెలుగు రీడర్స్ ని సంప్రదించండి.

@2025 – All Right Reserved. Designed and Developed by MrPKP.