షురువాయే కథ షురువాయే
షురువాయే కథ షురువాయే
ఇందుమూలంగా తుపాకులగూడం గ్రామ
ప్రజలందరికి తెలియజేయునది ఏమనగా
కొలువుకోలకు ఒప్పుకున్నోళ్లందరూ ఆస్తి పాస్తుల కాయితాలు
గొర్రెలు బర్రెలు కోళ్లు బాసన్లు ముందు ఎనక ఏవుంటే అయిబట్టుకుని
రేపు పొద్దుగాళ్ళ బొడ్డురాయిగాడికి రావాల ఆహా …
షురువాయే కథ షురువాయే
షురువాయే కథ షురువాయే
తమ్మి నువ్వు లెవ్వరా మాయాన్న నువ్వు లెవ్వరా
చిచ్చా జర్ర ఇటురా ఓ మచ్చా జల్ది ఇటురా
యతకబోయిన తీగేదో కాలికి సుట్టింది
అదృష్టలక్ష్మి వాకిలికొచ్చి తలుపులు తట్టింది
హాయ్ ఎంటికతోనే కొండనుగుంజే టైమే వచ్చింది
పల్లెలో ఉండి గల్లీల తిరిగే రాత మారనుంది
సర్కారోళ్ల డ్యూటీల ఎక్కే కథ ఇక షురువైంది
సర్కారోళ్ల డ్యూటీల ఎక్కే కథ ఇక షురువైంది
అక్కువ సక్కువ బేరం కుదిరే పైసలు సదురుండ్రి
ఉన్నయి లేనియ్ ఊడ్చి పెట్టుదాం లాటిరి తగిలింది
గల్లాగురిగిలా దాచిన డబ్బులు గల గల దులుపుండ్రి
సంచిలా గల గల లేకున్నా మిత్తికి అడుగుండ్రి
మంచి సమయము మించిన దొరకదు లేటు జేయకుండ్రి
సర్కారోళ్ల డ్యూటీల ఎక్కే కథ ఇక షురువైంది
సర్కారోళ్ల డ్యూటీల ఎక్కే కథ ఇక షురువైంది
సర్కారోళ్ల డ్యూటీల ఎక్కే కథ ఇక షురువైంది
సర్కారోళ్ల డ్యూటీల ఎక్కే కథ ఇక షురువైంది
చిత్రం: రెబల్స్ అఫ్ తుపాకులగూడెం (Rebels of Thupakulagudem)
పాట పేరు: షురువాయే (Shuruvaaye)
తారాగణం: ప్రవీణ్ కండెల, శ్రీకాంత్ రాథోడ్, జైత్రి మకానా, శివరామ్ రెడ్డి,
వంశీ వూటుకూరు, శరత్ బరిగెల, వినీత్ కుమార్, విజయ్ మచ్చ తదితరులు
గాయకులు: రాహుల్ సిప్లిగంజ్ (Rahul Sipligunj)
సాహిత్యం: కాసర్ల శ్యామ్ (Kasarla Shyam)
సంగీత దర్శకుడు: మణిశర్మ (Manisharma)
చిత్ర దర్శకత్వం: జైదీప్ విష్ణు (Jaideep Vishnu)