హల్లో తెలుగు రీడర్స్ ! మార్కెట్లోకి మరొక సి న్ జి బైక్ వచ్చేసిందండోయ్, అదే TVS జూపిటర్ CNG 125 స్కూటర్, ఈ TVS జూపిటర్ CNG 125 అనేది ద్వి-ఇంధన CNG స్కూటర్ గా వస్తుంది, ఇది పెట్రోల్ మరియు CNG మోడ్‌లలో కలిపి 226 కిలోమీటర్ల వరకు ప్రయాణించగలదని కంపెనీ తెలియచేస్తుంది. మరి ఇంకెందుకు ఆలస్యం ఒక పట్టు పట్టేద్దాం !
న్యూఢిల్లీలో ఈమధ్య జరిగిన భారత్ మొబిలిటీ ఎక్స్‌పోలో టీవీఎస్ మోటార్ కంపెనీ జూపిటర్ 125 CNGని ప్రదర్శించింది, త్వరలో లాంచ్ అవుతుందని కూడా తెలియచేసింది. అంతేకాకుండా జూపిటర్ 125 CNG వివరాలను కూడా కంపెనీ వెల్లడించింది.
జూపిటర్ 125 CNG స్కూటర్ ఇంతకు మునుపే మార్కెట్ లోకి వచ్చిన జూపిటర్ 125 CC స్కూటర్ ను ఆధారంగానే చేసుకొని రూపొందించబడింది. ఈ CNG స్కూటర్ 124.8-cc తో సింగిల్-సిలిండర్ ను కలిగి ఎయిర్-కూల్డ్ బై-ఫ్యూయల్ ఇంజిన్ 7.2 హార్స్‌పవర్ ను మరియు 9.4 Nm పీక్ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. అంతే కాకుండా దీని ఇంజిన్ CVT ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌తో జతచేయబడింది. గరిష్ట వేగం గంటకు 80.5 కి.మీ. ఉంటుందని కంపెనీ వెల్లడించింది.
TVS Jupiter 125 స్కూటర్ పెట్రోల్ కోసం 2-లీటర్ల ట్యాంక్ ను మరియు CNG నింపడానికి 1.4-కిలోల సిలిండర్‌ను కలిగి ఉంటుంది. CNG ట్యాంక్ సీటు కింద ఉంచబడుతుంది. ఫ్యూయల్ ఫిల్లర్ క్యాప్ అనేది ముందు ఆప్రాన్‌లో ఉంటుంది. అలాగే CNG నాజిల్ సీటు కింద ఉంటుంది. CNG మరియు పెట్రోల్ మోడ్ కలిపి 226 కిలోమీటర్లు వరకు వెళ్లవచ్చని కంపెనీ తెలియజేస్తుంది. CNG నుండి పెట్రోల్ మోడ్‌లోకి అలాగే పెట్రోల్ మోడ్ నుండి CNG మోడ్‌లోకి మారడానికి స్విచ్ బాక్స్‌పై ఉంచబడిన బటన్‌ను తాకడం ద్వారా మార్చుకోవచ్చు. జూపిటర్ CNG స్కూటర్ అనేది బజాజ్ ఫ్రీడమ్ 125 CNG తర్వాత రెండవ ద్వి-ఇంధన ద్విచక్ర వాహనంగా రాబోతుంది.
CNG జూపిటర్ మంచి క్వాలిటీ బైక్ గా రాబోతుందని TVS కంపెనీ తెలియజేస్తుంది. అలాగే జూపిటర్ 125 CNG మెటల్-మ్యాక్స్ బాడీరాబోతుందని, 125-cc కేటగిరీలో అతిపెద్ద సీటు తమ వద్ద ఉందని TVS చెబుతోంది.
ఫీచర్ల విషయానికొస్తే, జూపిటర్ 125 CNGలో LED హెడ్‌లైట్, మొబైల్ ఛార్జింగ్ పోర్ట్, ఆల్-ఇన్-వన్ లాక్ మరియు సైడ్ స్టాండ్ ఇండికేటర్ ఉన్నాయి. ఇది అనేక కీ రీడౌట్‌లతో సెమీ-డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ కన్సోల్‌ను కలిగివుంటుంది. దీని ఇంజిన్ TVSపేటెంట్ పొందిన ఎకో-థ్రస్ట్ ఫ్యూయల్-ఇంజెక్షన్ మరియు ఇంటెలిగో టెక్నాలజీతో వస్తుంది.
అయితే జూపిటర్ 125 CNG లాంచ్ కోసం కంపెనీ నిర్దిష్ట సమయాన్ని వెల్లడించలేదు, అయితే, ఈ స్కూటర్ 2025 చివరి నాటికి మార్కెట్‌లోకి అందుబాటులోకి వస్తుందని తెలుస్తుంది. అంతేకాకుండా TVS మోటార్ కంపెనీ భారత్ మొబిలిటీ ఎక్స్‌పోలో 2025లో ఇథనాల్-శక్తితో పనిచేసే రైడర్ 125, iQube విజన్ కాన్సెప్ట్ మరియు అపాచీ RTSX కాన్సెప్ట్‌లను కూడా ప్రదర్శించింది.
మరిన్ని ఇటువంటి వాటి కోసం తెలుగు రీడర్స్ టెక్నాలజీ చూడండి