సందమామ కంచమెట్టి సన్నజాజి బువ్వ పెట్టి
సందెమసక చీరగట్టి సందు చూసి కన్ను కొట్టి
సిగపువ్వు తెమ్మంటే మగరాయుడు
అరిటిపువ్వు తెస్తాడు అడవిపురుషుడు
సందమామ కంచమెట్టి సన్నజాజి బువ్వ పెట్టి
సందెమసక చీరగట్టి సందు చూసి కన్ను కొట్టి
భద్రాద్రి రామన్న పెళ్లికొడుకవ్వాల
సీతలాంటి నిన్ను మనువాడుకోవాల
బెజవాడ కనకదుర్గ బాసికాలు తేవాల
బాసరలో సరస్వతి పసుపూకుంకుమలివ్వాల
విన్నపాలు వినమంటే విసుగంటాడు
మురిపాల విందంటే ముసుగెడతాడు
విన్నపాలు వినమంటే విసుగంటాడు
మురిపాల విందంటే ముసుగెడతాడు
బుగ్గపండు కోరకడు పక్కపాలు అడగడు
పలకడు ఉలకడు పంచదార చిలకడు
కౌగిలింతలిమ్మంటే కరుణించడు
ఆవులింతలంటాడు అవకతవకడు
సందమామ కంచమెట్టి సన్నజాజి బువ్వ పెట్టి
సందెమసక చీరగట్టి సందు చూసి కన్ను కొట్టి
ఏడుకొండల సామి ఏదాలు చదవాల
సెవిటి మల్లన్నేమో సన్నాయి ఊదాల
అన్నవరం సత్తెన్న అన్నవరాలివ్వాల
సింహాద్రి అప్పన్న సిరిసేసలివ్వాల
పెదవి తెనేలందిస్తే పెడమోములు
తెల్లరిపోతున్నా చెలి నోములు
పెదవి తెనేలందిస్తే పెడమోములు
తెల్లరిపోతున్నా చెలి నోములు
పిల్లసిగ్గు చచ్చిన మల్లెమొగ్గ విచ్చిన
కదలడు మెదలడు కలికి పురుషుడు
అందమంతా నీదంటే అవతారుడు
అదిరదిరి పడతాడు ముదురుబెండడు
మరిన్ని తెలుగు పాటల సాహిత్యం కొరకు తెలుగు రీడర్స్ ని సందర్శించందండి.