మెల్ల మెల్ల మెల్ల మెల్లగా
కళలు కళ్ళల్లో వాలుతుండగా
గుచ్చి గుచ్చి విచ్చినట్టుగా
కంటి పాపలో పూవు పూయగా
ఆ ఆనందాల పువ్వు పేరు నవ్వు
లోన లోనే దాచుకోకు నువ్వు
లోకమంతా దాన్ని చూడనివ్వు
అది పూలతోటగా మారుతున్న
ఓ మాయ చూడగలవు
నవ్వుతో చిన్న నవ్వుతో
జగమంతా మార్చగలవు
నవ్వుతో చిన్న నవ్వుతో
గగనాన్ని దించగలవు
ఎదురయే ప్రతి నిమిషం
అడిగినది సంతోషం
ఆ కోరికనే తీర్చావంటే
కాలం నీకే దాసోహం
ఊహలు ఎన్ని పొంగి పొరలిన
ఏమి నష్టం లేదు స్వాగతించు
ఇక హాయి హాయి గా ఊగుతున్న
నీ ఎదను చూడగలవు
ఊహతో చిన్న ఊహతో
ఉదయాన్ని గీయగలవు
ఊహతో చిన్న ఊహతో
ఊపిరులు పోయగలవు
చిత్రం: సైజు జీరో
సంగీతం: ఎం.ఎం. కీరవాణి
సాహిత్యం: అనంత శ్రీరామ్
గాయకులూ: శ్వేతా పండిత్
నటులు: అనుష్క శెట్టి, ఆర్య, ప్రకాష్ రాజ్, సోనాల్ చౌహన్, తదితరులు.
మరిన్ని వాటి కోసం తెలుగు రీడర్స్ లిరిక్స్ ను సందర్శించండి.