Home » Adhire Hrudayama song lyrics (RX 100)

Adhire Hrudayama song lyrics (RX 100)

by Nikitha Kavali
715 views
Adhire Hrudayam song

అదిరే హృదయం
అదిరే ఆధరం
మధురం మధురం
నీతో జత
ముదిరే ప్రణయం
ముసిరే ప్రళయం
కరిగే పరువం
నీ కౌగిట
నీ వలపుల ఒడిలో
తలపుల సుడిగాలిలో
కడతేరణా
ప్రియా ప్రియా
సఖి ప్రియా
బ్రహ్మ నిజం
తెలియని వరమా
ఇలా ఇలా నువ్వాగిపో
కలై శిలై క్షణ కాలమా

అందాల ఆడ సింహమా
చందనాలు శిల్పమా
కోడె నాగు వేగమా
నన్నే చేరినీవుగా
నీతో ఆడే ఆటలే
ముద్దుల్లా సాగె వేటలో
పగ్గాలు వీడి
స్వర్గాలు దాటేయనా
మహా మహా అగాధమా
నిన్నే నిన్నే తెలియగ తరమా
ఇలా ఇలా నువ్వాగిపో
కలై శిలై క్షణ కాలమా

చల్లారిపోకే మొహమా
మంట లాగ రేగుమా
కంట నీరై జారుమా
నరాల్లోని నాదమా
నువ్వే నాతో లేనిదే
నాలోన ఏకం కానిదే
ఈ లోకమంతా
నా కంటికి సూన్యమే
ఇదే ఇదే సుఖం ఇదే
ఇహం పరం ఇప్పుడిక మనదే
ఇలా ఇలా నువ్వాగిపో
కలై శిలై క్షణ కాలమా

అదిరే హృదయం
అదిరే ఆధారం
మధురం మధురం
నీతో జత
నీ వలపుల ఒడిలో
తలపుల సుడిగాలిలో
కడతేరణా
ప్రియా ప్రియా
సఖి ప్రియా
బ్రహ్మ నిజం
తెలియని వరమా
ఇలా ఇలా నువ్వాగిపో
కలై శిలై క్షణ కాలమా

చిత్రం: RX 100
సంగీతం: చైతన్ భరద్వాజ్
సాహిత్యం: చైతన్య ప్రసాద్
గాయకులూ: కార్తీక్
నటులు: కార్తికేయ, పాయల్ రాజపుత్, రావు రమేష్, తదితరులు.

మరిన్ని వాటి కోసం తెలుగు రీడర్స్ లిరిక్స్ ను సందర్శించండి.

You may also like

Leave a Comment

Adblock Detected

Please support us by disabling your AdBlocker extension from your browsers for our website.