అందమా నీ ఉనికి ఎక్కడమ్మా
మెరిసే మేని పైన చూసే కనులలోన
మెరిసే మేని పైన చూసే కనులలోన
ఒంటరై తపించే హృదయం లోతులో దాగిన మమతలలోన
అందమా…….
బొమ్మను చేసిన చేతులతోనే బాధ పడే మనసు ఇచ్చాడా
కన్నులు అడిగే ప్రశ్నలకేమో కన్నీరే బదులన్నాడా
అందం ఏమిటంటే బదులే ఇవ్వగలడా
సృష్టే ఆగిపోదా తన గుట్టే తెలిసిపోదా
చంద్రుడా….. నీ వెన్నెలకన్నా గుండెను కోసే ముళ్ళు ఉన్నాయా
అందమా…….
చిత్రం: సైజు జీరో
సంగీతం: ఎం.ఎం. కీరవాణి
సాహిత్యం: ఇనగంటి సుందర్
గాయకులూ: ఎం.ఎం.కీరవాణి
నటులు: అనుష్క శెట్టి, ఆర్య, ప్రకాష్ రాజ్, సోనాల్ చౌహన్, తదితరులు.
మరిన్ని వాటి కోసం తెలుగు రీడర్స్ లిరిక్స్ ను సందర్శించండి.