ఆఆఆఆఆ..
ఆఆఆ… భ్రమ అని తెలుసు భ్రమ అని తెలుసు
బతుకంటె బొమ్మల ఆట అని తెలుసు
ఆఆఆ… కథ అని తెలుసు కథ అని తెలుసు
కథలన్ని కంచికే చేరునని తెలుసు
తెలుసు తెర తొలుగుతుందనీ
తెలుసు తెల్లారుతుందనీ
తెలుసు ఈ కట్టె పుట్టుక్కుమంటదనీ
తెలుసు ఈ మట్టి మట్టిలోకలిసిపోతదనీ
ఎన్ని తెలిసీ ఇరకాటంలో పడిపోతావు ఎందుకని
మాయ ఆఆఆ..మాయ మా..య… ఓఓఓఓ… ఓఓఓ
తేలపోయింది తెలిసిపోయింది తేలిపోయింది తెలిసిపోయింది
తెలియనిదేదో ఉందని మనసా..ఆఆ..ఓ.. ఓ.. ఓ
తెలుసని ఎందరు చెబుతున్నా అది ఉందో లేదో తేలని హంస…
కళ్ళు రెండు మూసేయాలంట మూడో కంటిని తెరవాలంటా…
మిన్నూ మన్నూ మిట్టా పల్లెం ఒక్కటిగా కనిపంచాలంటా…..
ఆడేవాడు ఆడించే వాడు ఏక పాత్రలని ఎరగాలంటా…
ఆ ఎరుక వచ్చి రాగానే… ఆ ఎరుక వచ్చి రాగానే… ఆ ఎరుక వచ్చి రాగానే
మాయం ఐపోతుందట మాయ…ఆ.. ఆ.. మాయ… మాయ… ఆఆఆ..మాయ..మాయ…
ఓఓఓఓఓ… వేదం తెలుసు!
తైలమున్నదాకే దీపమను వేదాంతం తెలుసు
శాస్త్రం తెలుసు!
శాశ్వతంగా ఉండేదెవ్వడీడలేడని తెలుసు
తెలుసు ఇది నీటి మూటనీ తెలుసులే గాలి మేడని
తెలుసు ఈ బుడగ ఠప్పనీ పగిలిపోతదనీ
తెలుసు ఉట్టి పై ఉన్నదంత ఉష్కాకియనీ
అన్నీ తెలిసి అడుసులో పడి దొర్లుతుంటావు దేనికని
మాయ మాయ మా.. య, ఓఓఓఓఓ… ఓఓఓఓఓ
చిత్రం: జగద్గురు ఆదిశంకరాచార్య
సంగీతం: నాగ్ శ్రీవత్స
సాహిత్యం: జె.కే. భారవి
గాయకులూ: శ్రీ రామ్ చంద్ర
నటులు: నాగార్జున, మోహన్ బాబు, శ్రీహరి, సాయికుమార్, మీనా, తదితరులు.
మరిన్ని వాటి కోసం తెలుగు రీడర్స్ లిరిక్స్ ను సందర్శించండి.