వాక్యమే శరీరదారి
లోక రక్షకుడు ఉదయంచే
పాపాన్ని శాపాన్ని తొలగింపను
రక్షకుడు భువికెత్తించెను
ఊరువాడ వీధులలో లోకమంత సందడంట
పాడెదము కొనియాడెదము
అరే పూజించి ఘనపరచెదమ్
చుక్క పుట్టింది యేలోయేలేలో
సందడి చేద్దామా యేలో
రాజు పుట్టినాడు యేలోయేలేలో
కొలవాపోదామా యేలో
గొఱెలు విడచి మందల మరచి
గాబ్రియేలు వార్త విని వచ్చామమ్మ
గానములతో గెంతులు వేస్తూ,
గగనాలంటేల ఘనపరచెదమ్ ||2||
చీకటిలో కూర్చున వారి కోసం
నీతి సూర్యుడేసు ఉదయంచే
పాపాన్ని శాపాన్ని తొలగింపను
పరమును చేర్చను అరుదించే
ఈ బాలుడే మా రాజు
రాజులకు రారాజు
ఇహం పరం అందరము
జగమంత సందడి చేద్దామ్
చుక్క పుట్టింది యేలోయేలేలో
సందడి చేద్దామా యేలో
పొలమును విడచి యేలోయేలేలో
పూజచేదామా యేలో
తారను చూచి తరలి వచ్చాము
తూర్పు దేశపు జ్ఞానులము
తన భుజముల మీద రాజ్యభారము ఉన్న తనయుడెవరో
చూడ వచ్చామమ్మ ||2||
బంగారు సాంబ్రాణి బోళమును
బాలునికి మేము అర్పించాము
మా గుండెలో నీకే నయ్య ఆలయం
మా మదిలో నీకే నయ్య సింహసనం
ఈ బాలుడే మా రాజు
రాజులకు రారాజు
ఇహం పరం అందరము,
జగమంత సందడి చేదామ్
చుక్క పుట్టింది యేలోయేలేలో
సందడి చేద్దామా యేలో
జ్ఞానాదీప్తుడమ్మ యేలోయేలేలో
భూవికెత్తించేనమ్మ యేలో
నీవే మా రాజు
రాజులకు రాజు
నిన్నే మేము కొలిచెదము
హొసన్నా పాటలతో
మా హృదయము అర్పించి హృదిలోనిన్ను కొలచి
Christmas నిజ ఆనందం
అందరము పొందెదము….
మరిన్ని వాటి కోసం తెలుగు రీడర్స్ భక్తి ని సందర్శించండి.