Home » నైమిషారణ్యం లో చూడవలసిన ప్రదేశాలు

నైమిషారణ్యం లో చూడవలసిన ప్రదేశాలు

by Nikitha Kavali
0 comment

మన భారత దేశం ఎన్నోపి పుణ్య క్షేత్రాలకు నిలయం. ఇక్కడ ప్రతి అడుగు పవిత్రం ఎందరో దేవతలు తిరిగిన నెల మన భారత నేల. అటువంటి భారత దేశం లో ముక్కోటి దేవతలు యజ్ఞం చేసిన ప్రదేశం, అష్టాదశ పురాణాలను రచించిన ప్రదేశం, మొట్టమొదటి సరిగా సత్యనారాయణ స్వామి వ్రత కథ చెప్పిన ప్రదేశం.

88000మహర్షులు తపస్సు చేసిన ప్రదేశం, వేద వ్యాసుడు మన వేదాలను 4 వేదాలుగా విభజించిన ప్రదేశం, మొట్టమొదట మహాభారతం పారాయణం చేసిన ప్రదేశం, ఇంద్రుడి వజ్రాయుధం తయారు చేసిన ప్రదేశం. ఇంతటి ఎన్నో పుణ్య కార్యాలు జరిగిన ప్రదేశం గనుక దీనిని మన దేశం లో అన్నిటికన్న పరమ పుణ్యక్షేత్రంగా పరిగణిస్తారు.

నైమిశారణ్యం చేరుకోవడం ఎలా?

నైమిశారణ్యం ఉత్తర్ ప్రదేశ్ లో సీతాపూర్ అనే గ్రామం లో ఉంది. లక్నో నుండి 94km దూరం లో నైమిశారణ్యం ఉంటుంది. ఇక్కడకు చేరుకోవాలంటే మీరు కచ్చితంగా లక్నో నుండి చేరుకోవాలి. లక్నో లో చార్ భాగ్ బస్టాండ్ లో 13వ ప్లాట్ఫారం లో నైమిశారణ్యం చేరుకునే బస్సులు ఉంటాయి. ఉదయం 5 గంటల నుండి సాయంత్రం 5 గంటల వరకు ప్రతి గంటకి మీకు నైమిశారణ్యం చేరుకొనే బస్సులు అందుబాటులో ఉంటాయి.

లక్నో నుండి నైమిశారణ్యం కి చేరుకోవడానికి 3 గంటలు పడుతుంది. మీరు లక్నో కి రైల్లో గని చేరుకున్నట్టు అయితే రైల్వే స్టేషన్ నుండి మీకు టాక్సీలు అందుబాటులో ఉంటాయి. కానీ టాక్సీ లో అయితే చార్జీలు కొంచెం ఎక్కువగానే ఉంటాయి. అందుకని మీరు రైల్వే స్టేషన్ నుండి చార్ భాగ్ బస్టాండ్ కు ఆటో లో చేరుకొని అక్కడి నుండి బస్సు లో నైమిశారణ్యం కు చేరుకొండి.

ఒకవేళ మీరు లక్నో కి విమానం ద్వారా చేరుకున్నట్టు అయితే లక్నో అంతర్జాతీయ విమానాశ్రయం నుండి నేరుగా టాక్సీ లో చేరుకోవచ్చు.

నైమిశారణ్యం లో చూడవలసిన ప్రదేశాలు:

నైమిశారణ్యం చుట్టూ పక్కల, నైమిశారణ్యం లో చూడవలసినవి ఎన్నో పుణ్య ప్రదేశాలు ఉన్నాయి. ఇక్కడ ఆ ప్రదేశాలు అన్నిటిని చూడటానికి మీరు ఆటో మాట్లాడుకోవచ్చు. ముందుగా ఇక్కడ ఉన్న దధీచి ఖుండ్ గురించి తెలుసుకుందాం.

శ్రీ చక్ర తీర్థం:

నైమిశారణ్యం లో ముఖ్యమైన ప్రేదేశం శ్రీ చక్రం దీనినే చక్ర తీర్థం అని కూడా అంటారు. శ్రీకృష్ణుడి ద్వాపరయుగం అంతం అయిపోయాక కలియుగ ప్రారంభం లో సౌనకాది మునులు బ్రహ్మ దగగ్రికి వెళ్లి కలియుగ ప్రభావం లేని ప్రదేశాన్ని యజ్ఞ నిర్వహణకు చూపించమని అడుగుతారు.

అప్పుడు బ్రహ్మ దర్భలతో ఒక చక్రాన్ని సృష్టించి అది ఎక్కడ అయితే ఆగి వెలుగుతుందో ఆ ప్రదేశం లో కలియుగ ప్రభావం ఉండదు అని బ్రహ్మ చెప్తాడు. అలా చక్రం వచ్చి ఈ నైమిశారణ్యం లో పెద్ద శబ్దం చేసి ఆగిపోతుంది. చక్రం అంచుని నైమి అని అంటారు, చక్రం అంచు తాకిన ప్రదేశం గనుక నైమిశం అని, ఇక చక్రం జన సంచారం లేని అటవీ ప్రాంతంలో పడుతుంది గనుక ఈ ప్రదేశాన్ని నైమిశారణ్యం అని పిలుస్తారు.

ఎటువంటి జన సంచారం లేని ప్రదేశం లో యజ్ఞాలు ఎలా చేస్తాము అని మునులు అందరు కలిసి శ్రీ మహావిష్ణువు దగ్గరికి వెళ్లి జరిగినదంతా చెప్తారు. అప్పుడు విష్ణువు తన సుదర్శనచక్రం ను ఈ భూమి మీద ఎక్కడ అయితే ఆగుతుందో అక్కడ యజ్ఞాలు చేసుకోమని చెప్తాడు. ఆ సుదర్శన చక్రం భూమండలం అంత తిరిగి చివరికి ఈ నైమిశారణ్యం లోనే వచ్చి పడుతుంది.

ఇక ఈ చక్రం పడిన ప్రదేశం లో అవి పాతాళం లోకి వెళ్లి అక్కడ ఎంతో వేగం తో ఒక నీటి ఖుండ ఉద్భవిస్తుంది. ఈ నీటి ప్రవాహాన్ని పరాశక్తి ఆపుతుంది అలా ఇక్కడ అమ్మవారు స్వయంభు లా ఉద్భవించారు. ఇక నైమిశారణ్యం లో లలిత దేవి అమ్మవారు ఉంటారు ఇక్కడ లలిత అమ్మవారు లింగరూపం లో దర్శనమిస్తారు.

వ్యాస మహర్షి ఆశ్రమం:

ఇంకా నైమిశారణ్యం లో వ్యాస మహర్షి ఆశ్రమం కూడా ఉంది. ఈ ప్రదేశం లోనే వ్యాస మహర్షి 18 పురాణాలను భోదించారు. నైమిశారణ్యం లో ప్రధానమైన రాజ్ ఘాట్ ఇక్కడే గోమతి నది ఒడ్డున ఉంటుంది. ఈ గోమతి నది ఒడ్డున స్నానం ఆచరించి సత్యనారాయణ స్వామి వ్రతం చేస్తారు.

హనుమాన్ గాడి:

హనుమాన్ గాడి కూడా నైమిశారణ్యం లో తప్పకుండ చూడవలసిన గుడి. రామ రవాణా యుద్ధం జరుగుతున్నప్పుడు మహిరణుడు రామలక్ష్మణులను ఈ ప్రదేశం లోనే పాతాళంలోకి తీసుకువెళ్తాడు. వాళ్ళని విడిపించడానికి హనుమంతుడు సూక్ష్మ రూపం దాల్చి వాళ్ళని విడిపించి తన భుజాల మీద రామలక్ష్మణులను ఎక్కించుకొని బైటికి తీసుకువస్తాడు.

ఇంకా ఇక్కడ తెలుగు వారు నిర్మించిన త్రిశక్తి ధామ్ మరియు బాలాజీ దేవుడి గుడులు రెండు ఉన్నాయి.

దధీచి ఖుండ్:

దధీచి ఖుండ్ నైమిశారణ్య కి 12km ల దూరం లో ఉన్న మిశ్రీక్ అనే చిన్న గ్రామం లో ఉంది. ఈ గ్రామం లోనే దధీచి మహర్షి అసమం ఉంటుంది. ఇక్కడే దధీచి మహర్షి తన ఎముకలతో దేవతల అందరికి ఆయుధాలు తయారు చేసాడు. ఈ ఆశ్రమం పక్కనే దధీచి ఖుండ్ ఉంటుంది. ఈ దధీచి ఖుండ్ వెనకాల కొంచెం పెద్ద కథే ఉంది.

పూర్వం ఈ భూమండలాన్ని బ్రహ్మ కుమారుడు అయినా క్షిపుడు పరిపాలించేవాడు. అతనికి దధీచి మహర్షి తో స్నేహం ఏర్పడింది. ఒకరోజు వీళ్లిద్దరు బ్రాహ్మణుడు గొప్పవాడా క్షత్రియుడు గొప్పవాడా అనే అంశం పై గొడవ పడుతూ ఉన్నారు. క్షిపుడు నేను శ్రీహరి అంశం తో జన్మించిన వాడిని అనే అహంకారం తో వదనాలాడుతూ ఉన్నాడు. దానికి దధీచి మహర్షి కి కోపం వచ్చి క్షిపుడిని తన కాళితో తంతాడు. దానికి క్షిపుడు ఆగ్రం తో తన దగ్గర ఉన్న ఆయుధం తో దధీచి ని రెండుగా చీలుస్తాడు.

మరణానికి దగ్గర్లో ఉన్న దధీచి శుక్రాచార్యుడిని ప్రార్థిస్తాడు. దాంతో శుక్రాచార్యుడు తనకి తెలిసిన మృత సంజీవని మంత్రం తో దధీచినీ కాపాడుతాడు. అప్పుడు శుక్రాచార్యుడు దధీచి తో ఇలా అంటాడు ఆ పరమేశ్వరుడిని ఆరాధించి మృత్యువును జయించు నాకు ఈ మృతసంజీవనిని కూడా ఆ ఈశ్వరుడే ఇచ్చాడు అని చెప్పి ఆతనికి త్రయంబకం మంత్రాన్ని ఉపదేశించాడు.

అలా దధీచి మహామృత్యుంజయ మంత్రాన్ని సాధన చేసి సిద్ధిని పొందాడు ఆయన శరీరం అభయత్వం, వజ్రం లాంటి ఎముకలను పొంది ఎంతో దృడంగా తయారు అయ్యాడు.

ఒకసారి వృత్తాసురుడు అనే రాక్షసుడు దేవలోకం పై దాడి చేసి దేవతలను ఓడించి దేవతల రాజ్యాన్ని సొంతం చేసుకుంటాడు. అప్పుడు దేవతలందరు శ్రీ మహా విష్ణువు దగ్గరికి వెళ్లగా “వృత్తాసురుడిని అంతం చేసేది దధీచి మహర్షి ఎముకల నుంచి చేసిన ఆయుధాల తోనే” అని శ్రీమహావిష్ణువు చెప్తాడు.

ఇక ఇంద్రుడు దధీచి మహర్షి దగ్గరికి వెళ్లి అతను దేవతలకు సహాయం చేయాలనీ కోరుకుంటాడు. అప్పుడు దధీచి మహర్షి తాను సహాయం చేస్తాను కానీ నాకు రెండు కోరికలు ఉన్నాయి ఆ కోరికలు తీరిపోతే మీకు నిస్వార్ధంగా సహాయం చేస్తాను అని చెప్పి తన కోరికలను చెప్తాడు.

మొదటిది భూలోకం లో ఉన్న పుణ్య నదులలో స్నానం ఆచరించాలి అని, రెండవది ముక్కోటి దేవతలను ఏక కాలం లో దర్శించుకోవాలి అని చెప్తాడు. అప్పుడు బ్రహ్మ దేవుడు భూమండలం లో అన్ని పుణ్య నదులను తీరగాలి అంటే చాల సమయం పడుతుంది అని ఆ దధీచి మహర్షి ఉన్న ఆశ్రమం దగ్గర ఒక పెద్ద ఖుండను సృష్టించాడు ముక్కోటి దేవతలందరు భూమండలం లోని అన్ని జీవనదుల నీటిని తీసుకువచ్చి ఈ ఖుండలో వేశారు.

అప్పుడు దధీచి మహర్షి ఆ పుణ్య నదుల ఖుండలో స్నానం ఆచరించి దాని చుట్టూ కూర్చొని ఉన్న ముక్కోటి దేవతల చుట్టూ ప్రదక్షిణ చేసి మీకు నా నుండి ఏం కావాలి అని దేవతలను అడుగుతాడు. దేవతలు వృత్తాసురుడిని చంపడానికి ఆయుధాలు లేవు నీ ఎముకల నుండి చేసిన ఆయుధాలే వృత్తాసురుడిని సంహరిస్తాయి అని శ్రీహరి చెప్పారు.

ఇక దధీచి మహర్షి తన శరీరం అంత ఉప్పు పెరుగు ని రాసుకొని కామధేనువు తో నాకించుకొని తన తపోశక్తి తో ప్రాణాలను విడిచాడు. దధీచి వెన్నుముక నుండి వజ్రాయుధం తయారయింది దానిని ఇంద్రుడు తీసుకున్నాడు, కుడి తొడ నుండి సారంగీ అనే ఆయుధం తయారైంది దానిని విష్ణుమూర్తి తీసుకున్నాడు, ఎడమ తొడ ఎముక నుండి పినాక అనే ఆయుధం తయారైంది దానిని మహేశ్వరుడు తీసుకున్నాడు.

ఇలా తన శరీరం లోని ఎముకలన్నిటితో ఆయుధాలు తయారు చేసుకొని దేవతలందరు తీసుకున్నారు. ఈ దధీచి మహర్షి ఆలయం ను మనం దర్శించుకుంటే ముక్కోటి దేవతలను ఏక కాలంలో దర్శించుకున్నంత పుణ్యం, అన్ని పుణ్య నదులను సందర్శించిన పుణ్యం కలుగుతుంది. దధీచి ఆశ్రమం లో దధీచి జీవితం లో ముఖ్యమైన ఘట్టాలను శిలల రూపం లో చెక్కి ఉంచారు. ఇంకా ఈ ఆశ్రమం లోపల దధీచి మహర్షి పూజించిన శివలింగం కూడా ఉంటుంది.

రుద్రావత్ మహాదేవ్ ఆలయం:

దధీచి ఆశ్రమం కి 13km ల దూరం లో రుద్రావత్ మహాదేవ్ ఆలయం ఉంటుంది. ఈ ఆలయం దగ్గర గోమతో నది ఉంటుంది ఈ నది అడుగు బాగాన గుప్త లింగం ఉంటుంది. ఈ నదిలో పూలు, పళ్ళు ఈ నది లోని గుప్తా లింగానికి సమర్పిస్తారు. భక్తులు ఈ నదిలో స్నానం చేసాక పక్కనే ఉన్న శివలింగాన్ని దర్శించి పూజ చేస్తారు. సత్యయుగం లో శివుడు తన ఆత్మ లింగాన్ని ఇక్కడే తపస్సు చేసి ప్రతిష్టించాడు అని పురాణాలూ చెబుతున్నాయి.

దేవదేవేశ్వర్ ఆలయం:

రుద్రవత్ నుంచి 4km ల దూరం లో దేవదేవేశ్వర్ ఆలయం ఉంటుంది. మనకి ఉన్న 68 జ్యోతిర్లింగాలలో ఇది మొట్టమొదటి జ్యోతిర్లింగం. ఇంద్రుడు ఆయుధాల కోసం దధీచి మహర్షి దగ్గరికి వచ్చినప్పుడు ఇంద్రుడు ప్రతిష్టించిన లింగం ఇది. ఇది సత్య యుగం లో ప్రతిష్టించిన లింగం కాబట్టి శివుడి ఆలయం ఎదురుగా నంది ఉండదు ఎందుకంటె శివుడు అప్పటికి నందికి వరం ఇవ్వలేదు.

సేతుబంద్ రామేశ్వరం ఆలయం:

దేవదేవేశ్వర్ ఆలయం కి కొంచెం దగ్గర్లోనే సేతుబంద్ రామేశ్వరం ఆలయం ఉంటుంది. రాముడు రావణుడిని సంహరించిన తరువాత రామునికి బ్రహ్మహత్య పాపం చుట్టుకుంటుంది. ఆ పాపం నుండి విముక్తి కోసం శ్రీ రాముడు లంక నుండి అయోధ్యకు వెళ్లే మార్గం లో కోటి లింగాలను ప్రతిష్టిస్తు వెళ్తాడు అందులో చివరి లింగం ఇదేను అని మన ఇతిహాసాలు చెబుతున్నాయి.

మరిన్ని వాటి కోసం తెలుగు రీడర్స్ విహారి ని సందర్శించండి.

You may also like

Leave a Comment