Home » ఏమో ఏమో – కాటమరాయుడు

ఏమో ఏమో – కాటమరాయుడు

by Hari Priya Alluru
0 comment

ఓ…ఏమో ఏమో ఏంటో

ఏమయ్యిందో ఏమో ఏంటో

ముల్లతీగమీద మల్లే పూసేసిందేంటో

ఏమో ఏమో ఏంటో

మొత్తం దారి మారిందేంటో

నల్లరాతి గుండెమీద సీతాకోకేంటో

చిరచిరలాడే కంట్లో చక్కెరదారేంటో

చినుకులు చూడని ఇంట్లొ తేనెల వానేంటో

ప్రతిదానికింక కారణంగ నిన్ను చూపుతుంది ఈ లోకం

నీకయ్యిందేంటో నే చేసిందేంటో ఏమో ఏంటో

నే చెప్పిందేంటో నా తప్పసలేంటో ఏమో ఏంటో

ఓ…ఏమో ఏమో ఏంటో

ఏమయ్యిందో ఏమో ఏంటో

ముల్లతీగమీద మల్లే పూసేసిందేంటో

మండేటీ సూర్యుడ్నైనా చల్లార్చే చందామామై

నువ్వొచ్చావా నాకోసం ఈ అదృష్టం ఏంటో

గర్జించే మేఘాన్నైనా కరిగించే చల్లాగాలై

నువు కలిసావా ఈ నిమిషం నా అదృష్టం ఏంటో

పేలే శభ్దాలెన్నైనా ఏం చెయ్లేదే ఇన్నాల్లూ

ఇవ్వాలిని శబ్దంలో హాయిగా వచ్చే వణుకేంటో

నాలో ఉండే పడుచుదనం నీలో ఉండే పదునుగుణం

ఒకటైపోతే మనపయనం అటుకో ఇటుకో ఎటుకో ఏంటో

ఓ…ఏమో ఏమో ఏంటో

ఏమయ్యిందో నాకే ఏంటో

ముల్లతీగమీద మల్లే పూసేసిందేంటో

ఓ…ఏమో ఏమో ఏంటో

ఏమయ్యిందో ఏమో ఏంటో

నల్లరాతి గుండె మీద సీతకోకేంటో

శత్రువులా గుండెల్లోనా నిద్రిస్తూ ఉండే నాకే

నిను చూస్తే నిద్దుర పాడై ఈ గుండే గుబులేంటో

కత్తుల్లో కదిలే నువ్వే మెత్తంగా మునిగావంటే

చంటోడైనా చెబుతాడే దానర్ధం ఏంటో

అందర్లోనా హుందాగా నిన్నా మొన్నా ఉన్నాగా

ఈపై ఎట్లాగుంటానో ఆపై జరిగే కథలేంటో

అక్కడతోనే గడపకురో కంచే పట్టూ పరికిణితో

నీకై వచ్చి నిలిచుంటే అరెరే అరెరే

మరిన్ని పాటల కోసం తెలుగు రీడర్స్ ను సందర్శించండి.

You may also like

Leave a Comment