తాత చేతిలోనా పెరిగినోడినమ్మా
అందుకే మోటుగా నేనుంట గనుకే
సేదయి పోయినానుకుంట
తాత చెప్పినట్టే నడిచినోడినమ్మా
అందుకే నిండుగా ప్రేమించా
ప్రేమనే మొండిగనే పంచా
ఆ ప్రేమే భారమని భారమని అమ్మాయి
నాకు దూరమవుతున్నావు లే
అమ్మలాంటి ప్రేమనే ఎదురైనయిదని రావోయి
అట్ట నువ్వు దూరమవ్వకే
యెన్నెలా…ఇయ్యాల రేపట్ల రోజులట్లున్నయే
నిన్నెట్లా నేనంటా తప్పు నాదైతదే
ఇయ్యాల రేపట్ల రోజులట్లున్నయే
నిన్నెట్లా నేనంటా తప్పు నాదైతదే
దీపాల పండుగ రోజు దీపాలే వెలుగుతుంటే
దీపంలా నా కంట పడ్డావులే
నా ఇంటి దీపానివని దేవునితో నేచెప్పినానే
ఈలోపే చీకటైపోతుంది లే
సుక్కపొద్దుకే నువ్వు నిద్దుర లేసి
సుక్కల్లే వాకిట్లో ముగ్గులు వేస్తే
ఎంత సక్కగుంటదమ్మ చుసేవాళ్ళకమ్మాయి
అంటే చిన్న చూపు చూస్తావే
యెన్నెలా…ఇయ్యాల రేపట్ల రోజులట్లున్నయే
నిన్నెట్లా నేనంటా తప్పు నాదైతదే
ఇయ్యాల రేపట్ల రోజులట్లున్నయే
నిన్నెట్లా నేనంటా తప్పు నాదైతదే
సినిమా షికారులే పిల్ల నిన్ను తిప్పలేదే
నలుగురు ఏమనుకుంటారని
వరసే ఉన్నాగాని సరసాలాడలేదే
చూసేటోళ్లు ఏమనుకుంటారని
లంగా వోణి కట్టు బొట్టును పెడితే
ఎంత సక్కదనమే చెంపకు చుక్కను పెడితే
ఎంత గొప్ప గుణము అని నలుగురు నిన్ను అంటుంటే
కన్నులు కట్టుకున్నోడికి ఎంత విలువనే
యెన్నెలా…ఇయ్యాల రేపట్ల రోజులట్లున్నయే
నిన్నెట్లా నేనంటా తప్పు నాదైతదే
ఇయ్యాల రేపట్ల రోజులట్లున్నయే
నిన్నెట్లా నేనంటా తప్పు నాదైతదే
నీలికళ్ళ సిన్నదాన్ని (Neeli Kalla Sinnadhani) సాంగ్ లిరిక్స్ – జానపద పాట (Folk Song)
మరిన్ని ఇటువంటి వాటి కోసంతెలుగు రీడర్స్ లిరిక్స్ను చూడండి