Home » నువ్వొస్తానంటే (Nuvvostanante) సాంగ్ లిరిక్స్ – వర్షం (Varsham)

నువ్వొస్తానంటే (Nuvvostanante) సాంగ్ లిరిక్స్ – వర్షం (Varsham)

by Rahila SK
0 comments
nuvvostanante song lyrics varsham

చినుకు రవ్వలో చినుకు రవ్వలో
చిన్నదాని సంబరాన
చిలిపి నవ్వులో
చినుకు రవ్వలో చినుకు రవ్వలో
చిన్నదాని సంబరాన
చిలిపి నవ్వులో

పంచ వన్నె చిలకలల్లే
వజ్రాల తునకలల్లే
వయసు మీద వాలుతున్న వాన గువ్వలో

చినుకు రవ్వలో చినుకు రవ్వలో
చిన్నదాని సంబరాన
చిలిపి నవ్వులో

ఇన్నాళ్లకు గుర్తొచ్చానా వాన
ఎన్నాళ్లని దాకుంటావే పైన
చుట్టంలా వస్తావె చూసెల్లి పోతావె
అచ్చంగా నాతోనే నిత్యం ఉంటానంటే
చెయ్యరా చేరధీసుకొన

నువ్వొస్తానంటే నేనొద్దంటానా
నువ్వొస్తానంటే నేనొద్దంటానా

తాటికిట తాటికిట తాటికిట

ఇన్నాళ్లకు గుర్తొచ్చానా వాన
ఎన్నాళ్లని దాకుంటావే పైన

ముద్దులొలికే ముక్కు పుడకై
ఉండిపోవే ముత్యపు చినుకా
చెవులకు సన్న జూకాల్లాగా
చేరుకోవే జిలుగులు చుక్క

చేతికి రంగుల గాజుల్లాగా
కాలికి మువ్వల పట్టిలాగా
మేడలో పచ్చల పతాకంలాగా
వదలకు నిగ నిగ నగలను తొడిగేలా

నువ్వొస్తానంటే నేనొద్దంటానా
నువ్వొస్తానంటే నేనొద్దంటానా

తాటికిట తాటికిట తాటికిట

చిన్న నాటి తాళీనైనా
నిన్ను నాలో దాచుకొన్న
కన్నే యేటి సోయగంలా
నన్ను నీలో పోల్చుకొన

పెదవులు పాడే కిల కిల లోన
పదములు ఆడే కధాకళీ లోన
కనులను తడిపే కలతలా లోన
నా అను అణువున నువ్వు కనిపించేలా

నువ్వొస్తానంటే నేనొద్దంటానా
నువ్వొస్తానంటే నేనొద్దంటానా

తాటికిట తాటికిట తాటికిట

ఇన్నాళ్లకు గుర్తొచ్చానా వాన
ఎన్నాళ్లని దాకుంటావే పైన

చుట్టంలా వస్తావె చూసెల్లి పోతావె
అచ్చంగా నాతోనే నిత్యం ఉంటానంటే
చెయ్యరా చేరధీసుకొన

నువ్వొస్తానంటే నేనొద్దంటానా
నువ్వొస్తానంటే నేనొద్దంటానా
నువ్వొస్తానంటే నేనొద్దంటానా
నువ్వొస్తానంటే నేనొద్దంటానా


చిత్రం: వర్షం (2004)
పాట: నువ్వొస్తానంటే (Nuvvostanante)
గీతరచయిత: సిరివెన్నెల సీతారామశాస్త్రి (Sirivennela Seetharama Sastry)
గాయకులు: K.S. చిత్ర (K.S. Chitra), రకీబ్ ఆలం (Raquib Alam), కల్పన (Kalpana)
సంగీత దర్శకుడు: దేవి శ్రీ ప్రసాద్ (Devi Sri Prasad)
తారాగణం: ప్రభాస్ (Prabhas), త్రిష కృష్ణన్ (Trisha Krishnan)

మరిన్ని ఇటువంటి లిరిక్స్ కోసం తెలుగు రీడర్స్ లిరిక్స్ ను చూడండి.

You may also like

Leave a Comment

About us

మేము తెలుగు వారికోసం, తెలుగులో తెలుగుని చదివే వారి కోసం, వారికి తెలుగు మీద వున్నా అభిమానాన్ని చూపించడానికి ఒక అంతర్జాల విశ్లేషణ ప్రదేశమును సృష్టించినాము. అదే తెలుగు రీడర్స్ అను ఈ ప్రదేశములో మేము మీకు కావాల్సిన కథలు, విశ్లేషణలు, పాటల రచనలు (గేయ రచనలు), చూడవలసిన ప్రదేశాలు, తెలుసుకోవలసిన సాంకేతిక పరిజ్ఞానం, చలన చిత్ర విశేషాలతో ఈ మా తెలుగు రీడర్స్ ని నింపి వున్నాము. మీకు ఎటువంటి ఇబ్బందులు వున్నా మామ్మాల్ని సంప్రదించండి ప్రక్కన వున్నా అనుసంధాన అంతర్జాల వనరుని నొక్కండి. తెలుగు రీడర్స్ ని సంప్రదించండి.

@2025 – All Right Reserved. Designed and Developed by MrPKP.