హాయ్ తెలుగు రీడర్స్ ! ఫ్లిప్ లేదా ఫోల్డింగ్ మొబైల్స్ ను ఇష్టపడేవారికి ఒక శుభవార్త. ఏంటంటే ప్రముఖ మొబైల్ సంస్థ మోటరోలా (Motorola) నుండి ఫ్లిప్ మోడల్ సంబందించి ఒక కొత్త మొబైల్ రాబోతుంది. అయితే ఈ ఫ్లిప్ లేదా ఫోల్డింగ్ మొబైల్స్ ఆల్రెడీ వచ్చున్నాయి కదా అనుకోవచ్చు, కానీ మోటరోలా (Motorola) నుండి రాబోయే ఈ మోడల్ ఫోన్ లు ఆటోమేటిక్ గా మొబైల్ హింజ్ ను కంట్రోల్ చేస్తుందని చెప్తున్నారు.
ఇప్పటి వరకు వచ్చిన మొబైల్స్ లో మనము మ్యానువల్ గా హింజ్ ను చేత్తో ఆపరేట్ చేస్తున్నాము. కానీ మోటరోలా (Motorola) తీసుకు రాబోయే ఈ కొత్తమోడల్స్ లో ఆటోమేటిక్ గా ఒక మోటార్ సహాయంతో హింజ్ ను కంట్రోల్ చేసేవిధంగా తీసుకుసువస్తున్నారు. అంటే మనము వెనుకకు లేదా ముందుకు తల వంచినట్లయితే దానికి తగ్గట్టు మొబైల్ డిస్ ప్లే అనేది ఆటోమేటిక్ గా రొటేట్ అవుతుంది.
అంటే మన అనుకూలతను బట్టి ఆటోమేటిక్ గా దానికి అదే యాంగిల్ చేంజ్ చేసుకునే విధంగా తీసుకురాబోతున్నట్లు తెలుస్తుంది. అయితే ప్రసుత కాలంలో మొబైల్ వినియోగం మరీ ఎక్కువయ్యింది. కాబట్టి ఇటువంటి సదుపాయాలు ఉన్న మొబైల్స్ మంచి జనాదరణ పొందే అవకాశముంది. దీనికి సంబందించిన పేటెంన్ రైట్స్ కూడా మోటరోలా (Motorola) సంస్థ పొందినట్లు తెలుస్తుంది. అయితే ఈ కొత్త మోడల్ మొబైల్ కోసం కొద్దికాలం వేచి ఉండాల్సిందే.
మరిన్ని ఇటువంటి వాటి కోసంతెలుగు రీడర్స్ టెక్నాలజీచూడండి