హాయ్ తెలుగు రీడర్స్ ! మీరు ఎక్కువగా ఉంగరాలు పెట్టుకోవడానికి ఇష్టపడుతారా ? అయితే రెడీగా ఉండండి. ఎందుకంటే శాంసంగ్ (Samsung) బ్రాండ్ నుంచి స్మార్ట్ ఉంగరం వచ్చేసింది. ఇది AI టెక్నాలిజీతో పనిచేస్తుంది. దీంతో మన హెల్త్ అప్డేట్స్ ముందుగానే తెలుసుకోవచ్చని చెబుతున్నారు. అయితే దీని ధర కూడా దాదాపు బంగారు ఉంగరానికి సమానంగా ఉంది. దీనిపేరు శాంసంగ్ గ్యాలాక్సీ రింగ్ (Samsung Galaxy Ring), దీన్ని చాలారోజుల క్రితమే శాంసంగ్ (Samsung) వారు లాంచ్ చేసినప్పటికీ ఇండియాలో మాత్రం లాంచ్ చేయకుండా ఆపేసారు.
అయితే రీసెంట్ గా ఇండియాలో కూడా బుకింగ్స్ ను ఓపెన్ చేశారు. దీని ధర ఎంత, అలాగే ఎప్పుడు డెలివరీ చేస్తారనేది చెప్పట్లేదు కానీ శాంసంగ్ (Samsusug) వెబ్సైటులో ప్రీ – రిజర్వేషన్స్ అయితే మొదలయ్యాయి. ప్రీ – రిజర్వేషన్స్ చేసుకున్నవాళ్లకు కొన్ని ఆఫర్స్ కూడా ప్రకటించారు. అవేంటంటే రింగ్ తో పాటు శాంసంగ్ వైర్ లెస్ ప్యాడ్ (Samsung Wireless Pad) ఇస్తున్నారు. ఇది ఒక డ్యూయల్ చార్జర్, ఇందులో మీ మొబైల్ సహాయంతో ఒకేసారి మీ స్మార్ట్ వాచ్, ఇయర్ బడ్స్ వంటివి ఛార్జింగ్ పెట్టుకోవచ్చు. దీనిదర సుమారు 5000 రూపాయలు వరకు ఉండవచ్చు.
అలాగే రింగ్ సంబందించిన సబ్స్క్రిప్షన్స్ ను కూడా ఉచితంగా ఇస్తామంటున్నారు. ఇంకా ఇన్బాక్స్ యాక్ససిసేరిస్ ఇస్తున్నారు. అయితే ఈ రింగ్ ధర సుమారు 40,000 వరకు ఉండవచ్చని టెక్ నిపుణుల అభిప్రాయం. అయితే మరి ఇంకెందుకు ఆలస్యం వెంటనే బుకింగ్స్ మొదలెట్టేయండి.
మరిన్ని ఇటువంటి వాటి కోసంతెలుగు రీడర్స్ టెక్నాలజీచూడండి