ఏలోరె ఎలోరె ఏలోరె ఎలోరె
ఏలేలు ఏలో ఏలో ఎలోరె
నా కళ్ళాకు నల్లాని కటుకెట్టీ
నొసటందంగా సిలకం బెట్టీ
బంగారు కమ్మలు సెవులకెట్టీ
రంగులా గాజులు సేతికేసీ
పట్టుచీర గట్టుకోని పట్ట గొలుసులేసుకోని
సేవలపూలు చుట్టుకోని బుగ్గసుక్కపెట్టుకోని
అచ్చతెలుగు అంటేవోలి పెళ్ళికూతురల్లే
నేను ముస్తాబు అయ్యి ముద్దు ముద్దు గున్నా
సిగ్గు ముగ్గులేస్తు ఎదురుజుత్తా ఉన్నా
రాజా కుమారులోలె రారా
ఈ పల్లె రాణి చెయ్యి పట్టుకోరా
డోలు సన్నాయిలు తేరా
నీ ఎంట నన్ను తీసుకోని పోరా
రాజా కుమారులోలె రారా
ఈ పల్లె రాణి చెయ్యి పట్టుకోరా
డోలు సన్నాయిలు తేరా
నీ ఎంట నన్ను తీసుకోని పోరా
బాల మణి బాలమణి
బంతిపూల మొఖము నీదే బాలమణి
బంతిపూల మొఖము నీదే బాలమణి
బంగారు గుణము నీదే బాలమణి
నేను పుట్టిన్నాడు శుక్రరారమంట
మాలచ్చిమల్లే నన్ను జూస్తరంట
నేను ఎదురుపడితే మంచి జరుగునంట
మా ఊరు వాడ అనుకుంటరంట
ఎన్ని నోములో నోచుకున్నరో
తొలిచూరి బిడ్డగా నేను బుట్టినానురా
ఎన్ని పూజలు జేసుకున్నరో
మా అబ్బఅయ్యకు మురిపమయ్యినానురో
చిన్ననాటినుండే నన్ను గుండెలోన పెట్టుకోని
గాబురంగా పెంచినారురా
ప్రేమ పుట్లకొద్దీ పంచినారురా
హొయ్ రాజా కుమారులోలె రారా
ఈ పల్లె రాణి చెయ్యి పట్టుకోరా
డోలు సన్నాయిలు తేరా
నీ ఎంట నన్ను తీసుకోని పోరా
రాజా కుమారులోలె రారా
ఈ పల్లె రాణి చెయ్యి పట్టుకోరా
డోలు సన్నాయిలు తేరా
నీ ఎంట నన్ను తీసుకోని పోరా
హాళి హాళిల రంగ హాళీ
సిన్నదాని సిగ్గులన్ని బోణి
హాళి హాళిల రంగ హాళీ
పిల్లదాని బుగ్గలెరుపుగాని
పెళ్ళిచూపులంటూ మా ఇంటికొచ్చీ
నన్నుజూసి మనసుఇచ్చుకుంటే
సుట్టు ఊరువాడా పెళ్ళికి పిలిచీ
నాకు పుస్తె కట్టీ లగ్గమాడుకుంటే
నీ చిటికనేలు పట్టుకోని అడుగులేస్తర
కుడికాలు బెట్టి ఇంట సిరిసంపదైతర
నీ చేతిలోన చేయి వేసి బోట్టువెడతర
ఎంత కష్టమొచ్చినా చెయ్యి ఇడిసిపెట్టర
అత్తమామలకు సొంతబిడ్డలాగ తోడుగుంటూ
పండగల్లే మారిపోతరా ఇంట సంబురాలు తీసుకొస్తరా
హే రాజా కుమారులోలె రారా
ఈ పల్లె రాణి చెయ్యి పట్టుకోరా
డోలు సన్నాయిలు తేరా
నీ ఎంట నన్ను తీసుకోని పోరా
రాజా కుమారులోలె రారా
ఈ పల్లె రాణి చెయ్యి పట్టుకోరా
డోలు సన్నాయిలు తేరా
నీ ఎంట నన్ను తీసుకోని పోరా
కోడికూతతోనే నేను నిద్ర లేసి
వాకిళ్లు అలికీ ముగ్గులేసుకుంటా
సద్దిబువ్వలోన సల్లాలుబోసి
పచ్చిమిర్చి కలిపీ నీకు ముద్దలేడతా
నా అందమంతా మూటగట్టి నీకు ఇస్తరా
మూడునెల్లలోనే నేను తీపిముచ్చటైతర
నా ఆశలన్నీ బండగట్టి దాసుకుంటరా
నువ్వు ఎదురుబడితే చాలు నీ గుండెకేస్తరా
చుడముచ్చటైన జంట నీది నాది అనుకుంటూ
గడియ గడియ మురిసిపోతరా
జన్మ జన్మలాకు జంటకడతరా
హొయ్ రాజా కుమారులోలె రారా
ఈ పల్లె రాణి చెయ్యి పట్టుకోరా
డోలు సన్నాయిలు తేరా
నీ ఎంట నన్ను తీసుకోని పోరా
రాజా కుమారులోలె రారా
ఈ పల్లె రాణి చెయ్యి పట్టుకోరా
డోలు సన్నాయిలు తేరా
నీ ఎంట నన్ను తీసుకోని పోరా
గోదారికే సోగ్గాన్నే సాంగ్ లిరిక్స్ – జానపద పాట
మరిన్ని ఇటువంటి వాటి కోసంతెలుగు రీడర్స్ లిరిక్స్ను చూడండి