పచ్చి ఉల్లిపాయలు తినడం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. ఇవి శరీరానికి అవసరమైన పోషకాలు మరియు యాంటీ ఆక్సిడెంట్లతో నిండి ఉన్నాయి. ముఖ్యంగా, పచ్చి ఉల్లిపాయలు కింది ప్రయోజనాలను అందిస్తాయి.
పచ్చి ఉల్లిపాయతో విటమిన్ – సి పుష్కలంగా ఉంటుంది. తెల్ల రక్త కణాలను ఉత్పత్తి చేయడంలో సహాయపుడతాయి. వల్లిపాయలో క్వెర్సెటిన్ అనే యాంటి ఆక్సీడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి శేరీరంలో చెడు కొలెస్టాల్ స్థాయిలను మెరుగుపరుస్తుంది. పచ్చి ఉల్లిపాయ తీసుకోవడం వల్ల రక్తపోటు మెరుగుపడి, గుండె జబులు రాకుండా చేస్తుంది. ఉల్లిపాయ ఎముక ఆరోగ్యాన్ని పెచుతుంది. రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రిస్తుంది.
- రోగనిరోధక శక్తిని పెంచుతుంది: పచ్చి ఉల్లిపాయలో విటమిన్-సి పుష్కలంగా ఉంటుంది, ఇది శరీరంలో రోగనిరోధక శక్తిని పెంచుతుంది. విటమిన్-సి అధికంగా ఉండటం వల్ల బాక్టీరియా, వైరస్ల నుంచి రక్షణ కల్పిస్తుంది. తెల్ల రక్త కణాలను ఉత్పత్తి చేయడంలో కూడా సహాయపడుతుంది.
- గుండె ఆరోగ్యానికి మేలు చేస్తుంది: పచ్చి ఉల్లిపాయలు గుండె జబ్బుల ప్రమాదాన్ని తగ్గించడంలో సహాయపడతాయి. ఉల్లిపాయలో ఫ్లేవనాయిడ్స్, థియో సల్ఫైట్స్ గుణాలు ఉన్నాయి, ఇవి శరీరంలోని చెడు కొలెస్ట్రాల్ను తగ్గించడంలో సహాయపడతాయి. ఇంకా రక్త ప్రసరణను నియంత్రించడం ద్వారా ఇది గుండెపోటు, స్ట్రోక్ ప్రమాదాన్ని తగ్గించవచ్చు.
- క్యాన్సర్ నుంచి రక్షణ: పచ్చి ఉల్లిపాయ క్యాన్సర్తో పోరాడడంలో ప్రభావవంతంగా పనిచేస్తుంది. ఉల్లిపాయలో సల్ఫర్ పరిమాణం చాలా ఎక్కువగా ఉంటుంది, ఈ మూలకం క్యాన్సర్ కణాలు పెరగకుండా అడ్డుకుంటుంది. తద్వారా క్యాన్సర్ నుంచి రక్షణ కల్పిస్తుంది.
- ఎముకల ఆరోగ్యానికి మేలు చేస్తుంది: ఉల్లిపాయల్లో క్యాల్షియం కూడా పుష్కలంగా ఉంటుంది, ఇది దంతాల, ఎముకల నిర్మాణానికి అవసరం. ఉల్లిని క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల ఎముకలు బలపడతాయి.
- జుట్టు ఆరోగ్యానికి మేలు చేస్తుంది: ఉల్లిపాయలో యాంటీ బాక్టీరియల్, యాంటీ ఫంగల్, యాంటీ ఆక్సిడెంట్ గుణాలు ఉన్నాయి, ఇవి జుట్టు బలంగా పెరగడానికి, చుండ్రు నివారణకు ఉపయోగపడతాయి. ఉల్లిపాయ రసాన్ని తలకు పట్టిస్తే జుట్టు ఒత్తుగా, మెరిసేలా, వేగంగా పెరగడంతోపాటు రక్తప్రసరణ పెరిగి శిరోజాలకు బలం చేకూరుతుంది.
- చర్మ ఆరోగ్యం: యాంటీ ఆక్సిడెంట్లు మరియు విటమిన్ C చర్మ ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి, ముడతలు మరియు వయస్సు మచ్చలను తగ్గించడంలో సహాయపడతాయి.
- మంటను తగ్గించడం: ఉల్లిపాయలు యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాల వల్ల శరీరంలోని మంటలను తగ్గించడంలో సహాయపడతాయి, ఇది అనేక ఆరోగ్య సమస్యలకు ఉపశమనాన్ని అందిస్తుంది.
- విటమిన్ – సి: పచ్చి ఉల్లిపాయతో విటమిన్ – సి పుష్కలంగా ఉంటుంది. ఇవి శేరీరంలో రోగనిరోధక శక్తిని పెంచుతుంది. విటమిన్ – సి అధికంగా ఉండటం వల్ల బాక్టీరియా, వైరస్ నుంచి రక్షణ కలిపిస్తాయి.
- జీర్ణవ్యవస్థకు మేలు: పచ్చి ఉల్లిపాయల్లో ఉన్న డైటరీ ఫైబర్ మలబద్ధకం మరియు ఇతర జీర్ణ సంబంధిత సమస్యలను నివారించడంలో సహాయపడుతుంది. ఇది ప్రోబయోటిక్‌గా పనిచేస్తుంది, తద్వారా మంచి బ్యాక్టీరియా పెరగడానికి దోహదపడుతుంది.
- బరువు నియంత్రణ: పచ్చి ఉల్లిపాయలు తక్కువ కేలరీలు మరియు అధిక ఫైబర్ కలిగి ఉంటాయి, ఇది ఆకలి నియంత్రణలో సహాయపడుతుంది. ఫలితంగా, ఇవి బరువు తగ్గడానికి సహాయపడవచ్చు.
- రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రిస్తుంది: పచ్చి ఉల్లిపాయల్లో ఇన్సులిన్ సెన్సిటివిటీని పెంచే లక్షణాలు ఉంటాయి. మధుమేహం ఉన్నవారు రోజూ పచ్చి ఉల్లిపాయలు తిన్నా రక్తంలో చక్కెర స్థాయిలను అదుపులో ఉంచుకోవచ్చు.
- వాపును తగ్గించడం: పచ్చి ఉల్లిపాయలలోని క్వెర్సెటిన్ యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలను కలిగి ఉంటుంది. ఇది శరీరంలోని ఏ భాగంలో కలిగే మంటను తగ్గిస్తుంది.
పచ్చి ఉల్లిపాయ తినడం మంచిదే. అయితే ఎంత ఆరోగ్యకరమైనప్పటికీ ఏదైనా పరిమితిలో తీసుకుంటేనే అమృతం, ఎక్కువైతే విషం అని గ్రహించాలి. ఈ ప్రయోజనాలను పొందడానికి రోజుకు ఒక పచ్చి ఉల్లిపాయ తినడం మంచిది, అయితే నోటికి వచ్చే వాసనను నివారించడానికి తరువాత నోటిని శుభ్రం చేసుకోవడం మంచిది.
ఇలాంటి మరిన్ని వాటి కొరకుతెలుగు రీడర్స్ టిప్స్ను సందర్శించండి.