మన అందరికి వర్షం పడిన తర్వాత వచ్చే ఆ మట్టి వాసన అంటే చాల ఇష్టం. ఆ పరిమళం మనకి ఎంతో ప్రశాంతత ను ఇస్తుంది. కానీ మీకు వాన పడినప్పుడు ఆ మట్టి వాసన ఎలా వస్తుందో తెలుసా. దానికి రెండు కారణాలు ఉన్నాయి. ఇప్పుడు తెలుసుకుందాం రండి.
మొదటిది సాధారణంగా వాన పడే ముందు నేల అంత పొడిగా ఉంటుంది. ఎప్పుడు అయితే వర్షపు చినుకులు పొడిగా ఉన్న మట్టి ని తాకుతుందో అప్పుడు జీఓస్మిన్ (geosmin) అనే ఒక అణువు(మాలిక్యూల్) రిలీజ్ అవుతుంది దాని వల్లనే ఈ పరిమళం వస్తుంది.
ఈ జీఓస్మిన్ (geosmin) అనే రసాయనాన్ని అనేక లక్షల బాక్టీరియా లలో ఒకటి అయినా అక్టీనోమిసెట్ట్స్ (actinomycetes) అనే బాక్టీరియా రిలీజ్ చేస్తుంది. ఈ జీఓస్మిన్ (geosmin) పరిమళం దోమలను గుడ్లు పెట్టేలా చేస్తుంది అందువల్లనే వర్షా కాలం లో మనకు దోమల బెడద కూడా ఎక్కువగా ఉంటుంది.
ఇక రెండో కారణం ఓజోన్ మాలిక్యూల్. వర్షం పడడానికి ముందు వచ్చే మెరుపులు O2 మొలిక్యూల్ ని స్ప్లిట్ చేసి మంచి పరిమళం వచ్చేలా ఓజోన్ మాలిక్యూల్ ను రిలీజ్ చేసేలా చేస్తుంది.
మరిన్ని వాటి కోసం తెలుగు రీడర్స్ సైన్స్ ను సందర్శించండి.