మన తెలుగు బాష ఎంతో చమత్కారమైంది. తెలుగు లో చాల సామెతలు , పొదుపు కథలు మనల్ని ఎంతో ఆహ్లాదాన్ని ఇస్తాయి. మనము చేసే తప్పులను ఎంతో చమత్కారంగా మన పెద్దలు సామెతల రూపం లో చక్కగా చెప్పేరు. మన సామెతలు మనల్ని పని చేసే విధంగా చేస్తాయి. ఇక్కడ మన తెలుగు సామెతలు కొన్ని ఉన్నాయి చదివేయండి.
- ఏలు ఇస్తే మొత్తం చెయ్యి గుంజేసాడు అంట
ఎరికైనా కొంచెం చనువు ఇచ్చినప్పుడు వాళ్ళు వాళ్ళ హద్దులను దాటి ప్రవర్తించినప్పుడు ఈ సామెతను వాడతారు.
- ఇల్లు కాలుతుంటే బావి తవ్వినట్టు ఉంది
ఒక పెద్ద తప్పు జరిగినప్పుడు దానికి అప్పటికప్పుడు పరిష్కారాలను వెతుకున్నప్పుడు వాడతారు అంటే తప్పు జరిగిపోయాక దానికి అప్పుడు పరిష్కారం వెతకడం కంటే ముందు నుంచే జాగ్రత్త గా వహించాలి అని చెప్పేటప్పుడు ఈ సామెతను వాడతారు.
- ఆవు చేలో మేస్తుంటే దూడ గట్టున మేస్తుందా
పిల్లలు ఏదైనా తప్పు చేస్తే తల్లి పెంపకం సరిగ్గా ఉంటె పిల్లలు ఆ తప్పు చేసి ఉండేవారు కాదు అని తెలిపే సందర్భం లో వాడతారు.
- గోరు చుట్టూ మీద రోకలి పోటు
అసలే బాధలో ఉన్న వారికి ఇంకా ఎక్కువ బాధ కలించే విషయం చెప్పినప్పుడు ఈ సామెతను వాడతారు.
- అంత ఉరిమి ఇంతేనా కురిసేది
కొంత మంది వాళ్ళ గురించి చాల ఎక్కువగా చెప్పుకుంటారు అంటే వాళ్ళు అది చేయగలను ఇది చేయగలను అని కానీ తీరా ఆ పని వాళ్ళు చేసాక వాళ్ళు చెప్పిన అంత గొప్పగా ఉండదు. అతిగా ఆత్మవిశ్వాసం ఉన్న వారిని సూచిస్తూ ఈ సామెతను వాడతారు.
- ఆలు లేదు చూలు లేదు కొడుకు పేరు సోమలింగం
ఏ పని మొదలు పెట్టకుండానే దాని నుంచి వచ్చే గొప్ప ఫలితాలను ఆసిస్తూ ఊహలలో ఉండిపోయేవారికి ఈ సామెతను ఉపయోగిస్తారు.
- ఇల్లు అలకగానే పండగ కాదు
చిన్న చిన్న విజయాలు సాధించిన అంత మాత్రాన మనం జీవితాన్ని గెలిచేసాం అని కాదు సాధించాల్సిన గొప్ప గొప్ప విజయాలు ఇంకా ముందు ఉన్నాయి అని తెలిపే సందర్భం లో వాడతారు.
- ఇంటి పేరు కస్తూరి వారు ఇంట్లో గబ్బిలాల కంపు
పైకి మంచి మనసు ఉండే వారి లాగ ఉంది లోపల మాత్రం స్వార్ధం తో నిండిపోయిన మనుషులను చెప్పడానికి ఈ సామెతని వాడతారు.
- ఉట్టి కి ఎక్కలేనమ్మా స్వర్గానికి ఎక్కున
ఒక గమ్యాన్ని చేరుకోవడానికి చేయాల్సిన చిన్న చిన్న పనులను చేయకుండా నేరుగా పెద్ద పనే చేస్తారు. ఉదాహరణకు ఇంట్లోకి వంట చేయడం సరిగ్గా రాని ఆమె ఊరంతా వనభోజనాలు పెడతాను అని చెప్పినట్టు ఉంటుంది అనే సందర్భాల్లో వాడతారు.
- ఉడికింది తినుడు తడికేసి పండుడు
కొంత మంది ఏ పని చేయకుండా తింటూ, నిద్రపోతూ జీవితాన్ని గడిపేస్తూ ఉంటారు అలాంటి వారి ని తిడుతూ ఈ సామెతను వాడతారు. సోమరితనంగా ఉండే వారికి ఈ సామెతను అంకితం చేస్తారు.
మరిన్ని వాటి కోసం తెలుగు రీడర్స్ సామెతలు ను సందర్శించండి.
1 comment
[…] సామెతలు అనేవి మన తెలుగు భాష పుట్టినప్పటి […]