Home » మీనాక్షి చౌదరి (Meenakshi Chaudhary) : అందాల చక్కటి బోమ్మ ఫొటోస్

మీనాక్షి చౌదరి (Meenakshi Chaudhary) : అందాల చక్కటి బోమ్మ ఫొటోస్

by Vishnu Veera
0 comment
64

మీనాక్షి చౌదరి (Meenakshi Chaudhary) తన సొగసైన ముఖం, ఆకర్షణీయమైన కళ్లతో మరియు పొడుగైన శరీర ఆకృతితో ధైర్యవంతమైన నడక మీనాక్షి చౌదరి మరింత ఆకర్షణీయంగా చేస్తాయి. మీనాక్షి చౌదరి 1997-03-05 న భారత దేశంలోని హర్యానా (Haryana)లో జన్మించారు. మీనాక్షి చౌదరి గారికి ఒక సోదరుడు కూడా ఉన్నాడు. మీనాక్షి గారి తండ్రి ఇండియన్ ఆర్మీ (Indian Army) లో అత్యంత స్థాయి అధికారిగా పనిచేసాడు. మీనాక్షి చౌదరి (Meenakshi Chaudhary) ప్రాధమిక విద్య అభ్యాసం అంత చండీగఢ్‌ (Chandigarh) లోని సోల్జర్ ఇంటర్నేషనల్ కాన్వెంట్ స్కూల్ (International Convent School) లో సాగింది.

ఆ తరువాత పంజాబ్‌లోని నేషనల్ డెంటల్ కాలేజ్ మరియు హాస్పిటల్ Hospital లో డెంటల్ సర్జరీలో బ్యాచిలర్ డిగ్రీ (Dental Surgery Bachelor’s ) కొనసాగిస్తూనే మోడలింగ్ (modeling) రంగం లో అడుగు పెట్టి ఆ తరువాత తనకు ఉన్న ప్రతిభతో సినిమాలో అవకాశాలు దకించుకున్నారు మీనాక్షి చౌదరి. చిన్నప్పుడు నుండి తన తండ్రి నుంచి నేర్చుకున్న మంచి మర్యాదలతో ప్రతి విషయం లో ప్లాన్ మరియు పద్దతిగా ఉండేవారు మీనాక్షి చౌదరి. చదువు తో పాటు తను ఏ రంగం లో అడుగుపెట్టిన బెస్ట్ గా ఉండేటట్టు ప్రయత్నించేవారు మీనాక్షి చౌదరి (Meenakshi Chaudhary). అందుకే మీనాక్షి చౌదరి గారు చదులోనే కాకుండా ఈత(swimming) లో బ్యాట్మెంటన్ (Badminton) లో కూడా రాష్ట్ర స్థాయి క్రీడా కారిగా తన ప్రతిభను చాటుకున్నారు మీనాక్షి చౌదరి.

దానితో పాటు మోడలింగ్ (modeling) రంగంలో ప్రవేసిస్తే బాగుంటుంది అని  తన స్నేహితులు చెప్పేవారు. అయితే మోడలింగ్ (modeling)  లాంటి గ్లామర్ ఫీల్డ్ లో ఉండే ఇబ్బందులు  గురించి ఆలోచించి  మీనాక్షి చౌదరి (Meenakshi Chaudhary)  గారి తండ్రి అంగీకరించలేదు. కానీ తరువాత మీనాక్షి చౌదరి గారు చెప్పడంతో తండ్రితో పాటు మీనాక్షి చౌదరి గారి కుటుంబం అంత ఒప్పుకున్నారు. అలా ఇండియన్ ఆర్మీ (Indian Army) వారు నిర్వహించిన  మిస్ ఐ ఏ (Miss I A) 2017 లో పాల్గోని విజేతగా  నిలవడం మీనాక్షి చౌదరి ఆత్మ విశ్వాసం ఎంతగానో పెంచింది. ఆ తరువాత 2018 లో మిస్ పామిన (Miss Pamina)  గా రాష్ట్రస్థాయి అందాల పోటీ లో మొదటి స్థానం లో నిలిచారు. ఆ వెంటనే  దేశంమొత్తం మీద జరిగిన ఫెమీనా మిస్ ఇండియా (Femina Miss India) పోటీలో జరిగిన రన్నర్ (Runner) గా టాఫీ గెల్చుకోవడమే కాకుండా మిస్ ఫోటో నుగా టైటిల్ గెలుచుకోవడం ద్యారా సంచలము సృష్టించింది.

అంతే కాకుండా ప్రపంచ స్థాయి అందాల పోటీలో మిస్ గ్రాండ్ ఇంటర్నేషనల్ 2018 లో పాల్గొని ప్రపంచ స్థాయి లో జరిగినా పోటీ లో కూడా రెండొవ స్థానములో  గెలిచింది. మీనాక్షి చౌదరి తండ్రి గారు భారత ఆర్మీ లో సేవలు అందించి సంపాదిస్తె. అయన కూతురు గా ప్రపంచ స్థాయి లో భారత దేశం తరుపున ప్రాతినిధ్యం వహించి రెండొవ స్థానం లో నిలవడం  దేశానికె గర్వకారగంగా  నిలిచారు మీనాక్షి చౌదరి. ఎందుకు అంటే ఇప్పటి వరకు భారత దేశం నుంచి ఈ పోటీలో రెండొవ స్థానం  వరకు వచ్చిన మహిళా మీనాక్షి చౌదరి మాత్రమే. అయితే అందం అనేది. కేవలం శారీరకమైనది  కాదు అంతకు మించి మానసిక మైనది కూడా నిరూపిస్తూ ఆ బ్యూటీ కాంటెస్ట్ ఫైనల్ లో అడిగిన ప్రశ్నకి ఈ విధంగా సమాధానం ఇచ్చారు మీనాక్షి చౌదరి.

మీ దృష్టిలో సక్సెస్ (Success) ఫెయిల్యూర్ (Failure) ఈ రెండింటిలో బెటర్ ఫ్యూచర్ (better future) ఏది అని అడిగిన ప్రశ్నలకి . మీనాక్షి చౌదరి నేను జీవితం లో ఎనో ఫెయిల్యూర్ చూసాను సక్సస్ కూడా చూసాను విజయం నాకు ఎంతో అందం చూపించింది. అపజయం నాకు మల్లి పుంజుకొని సక్సస్ అనే గమ్యం చేరుకునే మార్గాన్ని చూపించింది. విజయం అనేది నేను దేనికోసం కష్టపడుతాను అనే దానికి కారణం తెస్తే పరాజయం నువ్వు ఏం చేశావు, ఏస్థాయి లో ఉన్నావు ఎంత కష్టపడ్డావు అని కాకుండా అసలు నిజమైన సక్సస్ అంటే ఏంటో అది సాధించాలి అంటే ఎం చేయాలో నేర్పించింది.

అందుకే ఫెయిల్యూర్ అనేది నాకు సంబందించినంత వరకు జీవితంలో మనకు సక్సస్ అంటే తెలియజేసే బెస్ట్ టీచర్ అని చెప్పడం ద్వారా అక్కడ ఉన్న ఆడియన్స్ తో పాటు నాయనేతలుతో తన జవాబుతో తో ఆకట్టుకొని టైటిల్ రన్నరప్ గా నిలిచారు మీనాక్షి చౌదరి. అలాగే ప్రపంచ స్థాయి పోటీ అయిన మిస్ గ్రాండ్ ఇంటర్నేషనల్ (Miss Grand International) పోటీలో అంత వరకు ఏ భారతీయ మహిళా చేరుకొని విధంగా మొదటి స్థానానికి గట్టి పోటీగా నిలిచి రన్నరప్ గా బహుమతి గెలుచుకున్న సందర్భంలో మీరు ఈరోజు మిస్ గ్రాండ్ ఇంటర్నేషనల్ టైటిల్ గెలుచుకుంటే యుద్ధం హింస ఆపండి అని సందేశం ఇవ్వడానికి వెంటనే వెళ్లే దేశం ఏది, వారికీ మీరు ఇచ్చే సందేశం ఏంటి అనే ప్రశ్నకి నేను ఈ రోజు మిస్ గ్రాండ్ ఇంటర్నేషనల్ విజయత గెలిస్తే మొదట నేను ఇండోనేషియా (Indonesia) వెళతాను.

ఎందుకు అంటే ఈ మధ్య సంభవించిన ప్రకృతి విపత్తిలో లో ప్రపంచం లో అందరూ ఒకరితో ఒకరు పోటీపడి పరిగెడుతుంటే వారు మాత్రం ప్రాణాలు కాపాడుకోవడం కోసం పోటీ పడటం ప్రపంచంలో ఉన్న మనం అంత చూసాం. మనం అందరం తెలుసుకోవలసినది. మొదట మనం మనుషులం తరువాత మాత్రమే దేశం మంచి రంగు జాతి ఇవన్నీ వస్తాయి. అందరం కలసి ప్రకృతిని కాపాడుకోవాలి. ఏ రంగు దేహం ఉన్న మనిషి శరీరంలోఐనా ప్రవహించేది ఒకే రంగు రక్తం మనం అది అర్ధం చేసుకొని ప్రకృతిని కాపాడుకోవడం లో ప్రతి ఒక్కరు పాటించాలి.అని చెప్పడం ద్వారా ప్రపంచ స్థాయిలో తన విజయంతో భారత దేశ కీర్తిప్రతిష్టలు తెలియజేసింది మీనాక్షి చౌదరి. అయితే ఇన్ని అందాల పోటీలో 2016లో మిస్ ఇండియా పోటీలకి ఆడిషన్స్ ఇచ్చి రిజక్ట్ అయ్యారు . తనుకు ఎంతో ఇష్టమైన తన తండ్రి ఈ పోటీలో తాను ప్రయత్నిస్తున్న సమయం లో మరణించారు. కానీ ఇవి ఏమి కూడా విజయాన్ని ఆపలేకపోయాయి. తన పట్టుదలతో అనుకున్నది సాధించి తీరాలనే నిర్ణయించుకొని ప్రపంచ స్థాయి లో విజేతగా గా నిలిచారు మీనాక్షి చౌదరి.

2019 మే లో ఇలాంటి అమ్మాయి నా జీవితం లో కి రావాలి వస్తే బాగుంటుంది అనుకునే లాంటి పోటీలో భారత దేశవ్యాప్తంగా మీనాక్షి చౌదరి గారు రెండొవ స్థానం లో నిలవడం ద్వారా తన ప్రతిభవాలతో తాను సాధించిన విజయాలతో యువతలో ఎంత స్ఫూర్తి నింపారో మనం అర్ధం చేసుకోవచ్చు. ప్రపంచ స్థాయి లో మీనాక్షి చౌదరి (Meenakshi Chaudhary) సాధించిన విజయాలు చూసి అనేక సంస్థలు మోడలింగ్ అవకాశాలు ఇవ్వడం తొపాటు సినిమారంగం కూడా వరుస అవకాశాలు వచ్చాయి.

అక్కినేని సుశాంత్ (Sushanth) హీరో గా నటించిన సినిమా ఇచ్చట వాహనాలు నిల్పరాదు (Ichata Vahanamulu Niluparadu) 2021 – 08 – 27 న రిలీజ్ అయ్యింది. ఈ సినిమా అంతగా ఆడకపోయినా ఈ సినిమా మీనాక్షి చౌదరి (Meenakshi Chaudhary) గారి నటన అందం చూసీ వెంటనే రవితేజ (Ravi Teja) గారి లాంటి స్టార్ హీరోల సరసున ప్రధాన హీరోయిన్ గా ఖిలాడీ (Khiladi) సినిమా నటించింది. ఖిలాడీ సినిమా 2022 – 02 -11 నా రిలీజ్ అవబోతుండగా ఆతరువాత అడవిశేష్ (Adivi Sesh) గారు హీరోగా వస్తున్న హిట్ 2 (Hit 2) సినిమాలో కూడా హీరోయిన్ గా నటించే అవకాశాలు దక్కించుకుంది మీనాక్షి చౌదరి. ఆ తరువాత మహేష్ బాబు (Mahesh Babu) నటించిన గుంటూరు కారం (Guntur Kaaram) సినిమా తో తెలుగు ప్రేక్షలును పలకరించింది మీనాక్షి చౌదరి. ప్రస్తుతం లకీ బాస్కర్ (Lucky Baskhar) ది గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్ (The Greatest Of All Time) తదితర చిత్రాలు లో నటిస్తుంది.

మీనాక్షి చౌదరి ఫొటోస్:

ఇటువంటి మరిన్ని హీరోయిన్ల సమాచారం కోసం తెలుగు రీడర్స్ సినిమా ను చూడండి.

You may also like

Leave a Comment

Exit mobile version