Home » మామిడికాయ లస్సీ – తయారీ విధానం

మామిడికాయ లస్సీ – తయారీ విధానం

by Rahila SK
0 comment
78

కావలసిన పదార్థాలు:

  1. మామిడికాయ గుజ్జు – 1 కప్పు.
  2. పెరుగు – 1 కప్పు.
  3. పాలు – అర కప్పు.
  4. చక్కర – 2 టేబుల్ స్పూన్లు.
  5. యాలకుల పొడి – అర టీస్పూన్.
  6. పిస్తా ముక్కలు – తగినంత.
  7. బాదం ముక్కలు – తగినంత.
  8. ఐస్ ముక్కలు – 3 లేదా 4.

తయారీ విధానం:

ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని ఒక గిన్నె తీసుకుని దానిలో పాలు పోసి వేడి చేసుకుని చల్లారాక పక్కన పెట్టుకోవాలి. ఇపుడు ఒక మామిడికాయ తీసుకొని దానిని గుజ్జు ల చేసుకుని పక్కన పెట్టుకోవాలి. ఆ తురువాత పిస్తా మరియు బాదం ను చిన్నచిన్న ముక్కలుగా కట్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి. ఆ తురువాత 5 లేదా 6 యాలకులను పొడిల దంచుకొని పక్కన పెట్టుకోవాలి. ఇపుడు ఒక గిన్నెలో మామిడికాయ గుజ్జు, పెరుగు, వేడి చేసి చల్లరీనా పాలు, యాలకుల పొడి, చక్కర వేసి గెరిటతో కలుపుకోవాలి. ఆ తురువాత ఈ మిశ్రమంని తీసుకొని మిక్సి జార్ లోకి వేసుకుని చిక్కటి లస్సీ లా చేసుకోవాలి. ఆ తరువాత మామిడికాయ లస్సి ని ఒక గ్లాసుల్లో పోసి ఐస్ ముక్కలు మరియు పిస్తా ముక్కలు, బాదాం ముక్కలు వేసి గార్నేష్ చేసుకుంటే సరిపోతుంది.

ఇలాంటి మరిన్ని వాటి కొరకు తెలుగు రీడర్స్ వంటలు ను సందర్శించండి.

You may also like

Leave a Comment

Exit mobile version