గా గంగాధరి ఇంటికాడ
గంధమాల చెట్టు కింద గాజులేస్తానంటివి
గా గోముటోళ్ల ఇంటికాడ
గోరి చింత చెట్టు కింద చీర తెస్తానంటివి
నీ మాటలల్ల మగ్గిపోతి
చేతలల్లా సిస్టిపడితి తిరిగి సూడబోతివి
మల్లియన్న సుడవయ్యే మాటలన్నా కలపవయ్యే
మల్లియన్న సుడవయ్యే మాటలన్నా కలపవయ్యే
ఆగమైతిరో బావ ఆగమైతిరో
నీ మాటలల్ల మునిగి నేను మాయమైతిరో
ఆగమైతిరో బావ ఆగమైతిరో
నీ మాటలల్ల మునిగి నేను మాయమైతిరో
గా గంగాధరి ఇంటికాడ
గంధమాల చెట్టు కింద గాజులేస్తానంటివి
గా గోముటోళ్ల ఇంటికాడ
గోరి చింత చెట్టు కింద చీర తెస్తానంటివి
గా గంగుడొల్ల ఇంటికాడ
కళ్ళు తాటి చెట్టు కింద కాటుకిస్తానంటివి
గా పాపనోల్ల బాయికాడ
బర్రె మంద కొట్టుకాడ భజనమే చేస్తివి
మందిలోని మాటలాడి మనసుతొటి ఆటలాడి
మళ్ళి రాక పోతివి
తీరు తీరు ఆటలాయె
మత్తిలోని మాటలాయె
తీరు తీరు ఆటలాయె
మత్తిలోని మాటలాయె
ఏమిచేతురో బావ ఏమిచేతురో
నీ అల్లి బిల్లీ ఆటలోన బొమ్మనైతినో
ఏమిచేతురో బావ ఏమిచేతురో
నీ అల్లి బిల్లీ ఆటలోన బొమ్మనైతినో
గా గంగుడొల్ల ఇంటికాడ
కళ్ళు తాటి చెట్టు కింద కాటుకిస్తానంటివి
గా పాపనోల్ల బాయికాడ
బర్రె మంద కొట్టుకాడ భజనమే చేస్తివి
గా సకానోళ్ళ ఇంటికాడ
బట్టలుతుకే బాండకాడ గొలుసుతేస్తనంటివి
గా కుమ్మరోళ్ల ఇంటికాడ
కుసరాగు చెట్టు కింద చెవి దిద్దులాంటివి
నీ మాటలల్ల అలీనాయి
సిటికెను ఏలుపట్టుకుని సోపాతైతనంటివి
నీ మాటలేమో కోటదాటే
మందియేమో మాదల సుసే
నీ మాటలేమో కోటదాటే
మందియేమో మాదల సుసే
నా ఏలుబడితివో బావ ఆలినైతారో
నిన్ను ఏళ్లకాలం చూసుకుంటా తోడుగుంటెనో
గా సకానోళ్ళ ఇంటికాడ
బట్టలుతుకే బాండకాడ గొలుసుతేస్తనంటివి
గా కుమ్మరోళ్ల ఇంటికాడ
కుసరాగు చెట్టు కింద చెవి దిద్దులాంటివి
పాట: గంగాధరి ఇంటికాడ (Gangadhari Intikada)
సాహిత్యం – గానం: దివ్య భోనగిరి (Divya Bhonagiri )
సంగీతం: హనీ గణేష్ (Honey Ganesh)
తారాగణం: యమునా తారక్ (Yamuna Tarak )
మరిన్ని ఇటువంటి లిరిక్స్ కోసం తెలుగు రీడర్స్ లిరిక్స్ ను చూడండి.