Home » ఫరియా అబ్దుల్లా Faria Abdullah : టాలీవుడ్‌కి పరిచయమైన ఆరు అడుగుల అందం

ఫరియా అబ్దుల్లా Faria Abdullah : టాలీవుడ్‌కి పరిచయమైన ఆరు అడుగుల అందం

by Vishnu Veera
0 comment
165

ఫరియా అబ్దుల్లా (Faria Abdullah) చాలా మందికి తెలియకపోవచ్చు కానీ  ‘చిట్టి’ (Chitti)  అంటే తెలుగు యువత వెంటనే గుర్తుపట్టేస్తారు. 1998-మే -28  తండ్రి సంజయ్ అబ్దుల్లా తల్లి కౌసర్ సుల్తానా దంపతులకు హైదరాబాద్ (Hyderabad)  లోని  బంజారా హిల్స్ లో జన్మించింది. ఫరియా అబ్దుల్లా (Faria Abdullah) 10 క్లాస్ వరకు ప్రైవేట్ స్కూల్ లో చదివింది. ఇంటర్మీడియట్ ఇంట్లోనే చదువుతూ పెయింటింగ్  మరియు సాహిత్యం నేర్చుకుంది.

ఆ తర్వాత నాటక రంగం పై ఆసక్తి కలిగింది. 7 సంవత్సరాలు పాటు అనేక నాటక సంస్థలో చేరి నటన నేర్చుకుంది. రవీంద్ర భారతి (Rabindra Bharti) తో సహా అనేక కలక్షత్రాలు లో నాటకాలు ప్రదర్శించి ఎన్నో పాత్రలు పోషించింది. అప్పుడే ఫరియా అబ్దుల్లా లో ఉన్న రచయిత మేల్కొన్నాడు. నాటకాలు రచయిత దగ్గర కొని మెలుకువలు నేర్చుకొని నాటకాలు కూడా  రాసింది. కొని నాటకాలకి దర్శకత్వం చేసింది. ఫరియా అబ్దుల్లా 7 సంవత్సరాలు నాటకాలు చేస్తూనే  లయోలా కాలేజ్ (Loyola College) మాస్ కమ్యూనికేషన్లో డిగ్రీ పూర్తిచేసింది.

ఒక్క వైపు నాటకాలు మరో వైపు హిప్ ,హాప్, బిలి డాన్స్ (Hip, Hop, Billy Dance) వంటి నేర్చుకుంది. మరో వైపు చదువుకుంటూనే ‘ది బెస్ట్ వరస్ట్ డేట్’ (The Best Worst Date) అలాగే వెంటూ ఫ్రెండ్స్ లైక్ దా సేమ్ గర్ల్ (Ventoo friends like the same girl) కొన్ని షాట్ ఫిల్మ్ (Shot film) లోను  నక్షత్ర (Nakshatra) వంటి వెబ్ సిరీస్‌ (Web series) లో ఫరియా అబ్దుల్లా నటించారు. 2018 లో డైరెక్టర్ నాగ్ అశ్విన్ (Director Nag Ashwin) ఒక కార్యక్రమం కోసం లయోలా కాలేజ్ గెస్ట్ గా పోయాడు. ఆ కార్యక్రమం అయిపోయాక నాగ్ అశ్విన్ కలిసి తన గురించి పరిచయం చేసుకొని మీ సినిమా లో ఏదైనా అవకాశం ఉంటే ఇవండీ సార్ అని అడిగింది ఫరియా అబ్దుల్లా.

అప్పుడు నాగ్ అశ్విన్ ఒక్క ప్రాజెక్ట్ (project) చస్తున్నాం. ఆసక్తి ఉంటే ఆఫీస్ లో కలువు  అని  డైరెక్టర్ నాగ్ అశ్విన్ చెప్పాడు. ఆ తర్వాత  ఒక్క రోజు ఫరియా అబ్దుల్లా (Faria Abdullah)  డైరెక్టర్ నాగ్ అశ్విన్ ఆఫీస్ కి పోయింది.  ఫరియా అబ్దుల్లా చేసిన షార్ట్ ఫిల్మ్స్  మరియు నాటకాలు చూసి తనకు ఆడిషన్ పెట్టారు. ఫరియా అబ్దుల్లా డైలాగ్ చెప్పే విధానం బాగా నచ్చి అప్పుడే ఫరియా అబ్దుల్లా ఎంపిక చేశారు. కానీ ఆ పాత్రకు ఎంపిక చేశారు అని మాత్రం ఫరియా అబ్దుల్లా (Faria Abdullah) కి చెప్పలేదు.

2019లో అనుదీప్ దర్శకత్వం నవీన్ పోలిశెట్టి ,ప్రియదర్శి ,రాహుల్ రామకృష్ణ హీరోలు గా జాతి రత్నాలు (Jathi Ratnalu)  అనే సినిమా  షూటింగ్ మొదలయ్యేది. ఆ షూటింగ్ కి వెళ్లక తనే కథానాయకి పాత్రా పోషిస్తుంది అని తెలిసాక ఫరియా అబ్దుల్లా చాలా అనందించింది. షూటింగ్ లో తెలుగు కూడా బాగా నేర్చుకుంది. జాతి రత్నాలు (Jathi Ratnalu) సినిమా 2019లో పూర్తయిపోయింది. 2020లో విడుదల చేయాలని అనుకున్నారు.అయితే ఈ కరోనా వల్ల లోక్డౌన్ పెట్టడంతో సినిమా ఆగిపోయింది. ఆ సమయం లో చాల సినిమాలు ఆగిపోయాయి.

 ఓ.టి.టి (O.T.T.) కి ఇచెదమా లేదా  థియేటర్‌ లో రిలీజ్ చేద్దామా  అని ఫరియా అబ్దుల్లా అడిగారు     డైరెక్టర్ నాగఅశ్విన్. అప్పటికే చాలా రోజు అయిపోవడం తో  ఓ.టి.టి. (O.T.T.) కి ఇచ్చేదం సార్ అని ఫరియా అబ్దుల్లా సలహా చెప్పింది. అయితే ఎక్కువ మంది థియేటర్‌ లో  రిలీజ్ చేద్దాం అని చెప్పడం జరిగింది. నాగఅశ్విన్ ఎదురు చూసీ 2021 – మార్చి – 11న  జాతి రత్నాలు (Jathi Ratnalu)  సినిమా విడుదల చేసారు. జాతి రత్నాలు (Jathi Ratnalu) సినిమా ప్రమోషన్ కూడా బాగా చేయడం తో సినిమా పై మంచి అభిప్రాయం వచ్చింది. జాతి రత్నాలు (Jathi Ratnalu) సినిమా మొదటి రోజు 5 కోట్లు (5 crores) వసూలు చేసింది. రెండో రోజు 15 కోట్లు (15 crores) వసూలు చేసింది.

జాతిరత్నాలు (Jathi Ratnalu) సినిమా లో నవీన్ పోలిశెట్టి తరువాత  ఫరియా అబ్దుల్లా పోషించిన ‘చిట్టి’ (Chitti) పాత్రకు మంచి పేరు వచ్చింది. ఫరియా అబ్దుల్లా నటన, అందం తెలుగు కుర్రాళ్లకు తెగ నచ్చింది. ఒక్క సారిగా ఫరియా అబ్దుల్లా  ‘చిట్టి’కి  తెలుగు ఇండస్ట్రీ (Telugu Industry) లో సినిమా ఆఫర్లు వచ్చాయి.  ఇప్పటివరకు 7 లేదా 8 సినిమాలో  కథానాయకిగా  ఫరియా అబ్దుల్లా నటిచడం జరిగింది. అయితే కథ తనకు నచ్చితే సినిమా చేస్తాను నచ్చక పోతే సినిమా చేయను అని చెబుతుంది. ఒక వేళ తనకు సినిమా ఆన్సర్ రాకపోయినా సినిమా రంగంలో నటించకపోయిన తనకు నచ్చిన ఎన్నో రంగాలు ఉన్నాయి.  అని ఆత్మ విశ్వాసం తో చెపుతున్న ఫరియా అబ్దుల్లా  (Faria Abdullah). మంచి నటిగా సినిమా రంగంలో మనసు పూర్తిగా ఎదగాలి అని కోరుకుంటున్నాను.

ఫరియా అబ్దుల్లా ఫొటోగ్రఫీ :

మరిన్ని ఇటువంటి వాటి కోసం తెలుగు రీడర్స్ సినిమా ను సందర్శించండి.

You may also like

Leave a Comment

Exit mobile version