Home » చూపే బంగారమాయనే శ్రీవల్లి – పుష్ప

చూపే బంగారమాయనే శ్రీవల్లి – పుష్ప

by Vishnu Veera
0 comment
141

నిను చూస్తూ ఉంటె

కన్నులు రెండు తిప్పేస్తావే

నీ చూపులపైనే రెప్పలు వేసి కప్పేస్తావే

కనిపించని దేవుణ్ణే కన్నార్పక చూస్తావే

కన్నుల ఎదుటే నేనుంటే కాదంటున్నావే

చూపే బంగారమాయనే శ్రీవల్లి

మాటే మాణిక్యమాయెనే

చూపే బంగారమాయనే శ్రీవల్లి

నవ్వే నవరత్నమాయనే

అన్నిటికి ఎపుడూ

ముందుండే నేను

మీ ఎనకే ఇపుడూ పడుతున్నాను

ఎవ్వరికి ఎపుడూ

తలవంచని నేను

నీ పట్టీ చూసేటందుకు

తలనే వంచాను

ఇంతబతుకు బతికి

నీ ఇంటి చుట్టూ తిరిగానే

ఇసుమంత నన్ను చూస్తే చాలు

చాలనుకున్నానే

చూపే బంగారమాయనే శ్రీవల్లి

మాటే మాణిక్యమాయెనే

చూపే బంగారమాయనే శ్రీవల్లి

నవ్వే నవరత్నమాయెనే

నీ స్నేహితురాళ్ళు ఓ మోస్తరుగుంటారు

అందుకనే ఏమో నువ్వందంగుంటావు

పద్దెనిమిది ఏళ్ళు వచ్చాయా చాలు

నువ్వేకాదెవ్వరైనా ముద్దుగ ఉంటారు ఎర్రచందనం చీర కడితే

రాయి కూడా రాకుమారే

ఏడు రాళ్ళ దుద్దులు పెడితే

ఎవతైనా అందగత్తె అయినా

చూపే బంగారమాయనే శ్రీవల్లి

మాటే మాణిక్యమాయెనే

చూపే బంగారమాయనే శ్రీవల్లి

నవ్వే నవరత్నమాయెనే…

మరిన్ని తెలుగు పాటల సాహిత్యం కొరకు తెలుగు రీడర్స్ ని సందర్శించండి.

You may also like

Leave a Comment

Exit mobile version