హాయ్ తెలుగు రీడర్స్ ! ఒక గంటలో చేసేపని పదినిమిషాల్లో చేస్తే, అలాగే ఒక రోజు చేసే పని ఒక గంటలో అయిపోతే ఎలావుంటుంది, ఏంటి నిజామా అనుకుంటున్నారా ? అవును నిజమేనండి, ఈ AI టెక్నాలజీ వచ్చిన తరువాత అది సాధ్యమవుతుంది. ఎనుదకంటే చాల రకాల AI టూల్స్ ఇప్పుడు మనకు అందుబాటులోకి వచ్చేశాయ్, ఇవి హార్డ్ వర్క్ ను స్మార్ట్ వర్క్ చేసేశాయి. ఈ టూల్స్ లో కొన్ని పైడ్ టూల్స్ ఉన్నాయి అలాగే ఇంకొన్ని ఫ్రీ టూల్స్ కూడా ఉన్నాయి. ఇప్పుడు మనం ఆ ఫ్రీ టూల్స్ లో మనకు ఎక్కువగా ఉపయోగపడే కొన్ని AI టూల్స్ ని ఇక్కడ పరిశీలిద్దాం.
మొదటి AI టూల్ ని పరిశీలిస్తే, ఈ టూల్ వుపయోగించి మనం రెడీ చేసుకున్న స్కిప్ట్ టెక్స్ట్ ను ఆడియో ఫైల్ లోకి మార్చుకోవచ్చు, అదికూడా మనకు నచ్చిన (ఆడ లేద మగ) గొంతుతో మార్చుకోవచ్చు.
దీని కోసం గూగుల్ లో micmonster అని టైపు చేసి సెర్చ్ చేయండి లేదా https://micmonster.com/ అనే వెబ్సైటు ఓపెన్ చేసి మనం రెడీ చేసుకున్న టెక్స్ట్ ను అక్కడ పేస్ట్ చేసి ఆడియో ఫైల్ లోకి మనకు నచ్చిన గొంతులోకి మార్చుకోని డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఇందులో ఇంగ్లీష్, తెలుగు తో పాటు చాల భాషలలో కూడా మార్చుకోవచ్చు.
ఇక రెండవ టూల్ విషయానికి వస్తే ఇందులో ఆల్రెడీ మన దగ్గర ఉన్న ఆడియో ఫైల్ లో ఏవైనా నాయిస్ డిస్ట్రబెన్స్ ఉంటే వాటిని రీమూవ్ చేసి ఒక ప్రొఫెషనల్ ఆడియో గా మార్చుకోవచ్చు
దీనికోసం గూగుల్ లో adobe postcast అని సెర్చ్ చేయండి లేదా https://podcast.adobe.com/ అనే వెబ్సైటు ఓపెన్ చేసి అందులో నాయిస్ ఉన్న ఆడియో ఫైల్ ను అప్లోడ్ చేసి దాన్ని ఒక ప్రొఫెషనల్ ఆడియో ఫైల్ గా మర్చి డౌన్లోడ్ చేసుకోవచ్చు.
ఇక మూడవ టూల్ విషయానికొస్తే సాదారణంగా ఒక ఫోటోకి బ్యాగ్రౌండ్ మార్చుకోవడం చేసుంటాము. కానీ ఇందులో వీడియోకి బ్యాగ్రౌండ్ ను తీసేసి మనకి నచ్చినట్టుగా మార్చుకోవచ్చు.
దీనికోసం గూగుల్ లో video bg remover అని సెర్చ్ చేయండి లేదా https://vidbgrem.media.io/ అనే వెబ్సైటు ఓపెన్ చేసి అందులో బ్యాగ్రౌండ్ రీమూవ్ చేయాల్సిన అప్లోడ్ చేసి మనకు కావలసిన విధంగా మార్చుకోవచ్చు.
అలాగే మరొక టూల్ విషయానికొస్తే ఇందులో ఒక వీడియోలో ఉండే మనకు నచ్చని లేదా అవసరం లేని పర్టికులర్ ఆబ్జెక్ట్ తీసేసి మనకు నచ్చిన విధంగా మార్చుకోవచ్చు.
దీనికోసం గూగుల్ లో runwayml అని సెర్చ్ చేయండి లేదా https://runwayml.com/ అనే వెబ్సైటు ఓపెన్ చేసి ఇందులో గూగుల్ అకౌంట్ ద్వారా లాగిన్ అయి అందులో ఉండే ఇన్ పెయింటింగ్ అనే ఒక ఆప్షన్ లోకి వెళ్లి అందులో మన వీడియోను అప్లోడ్ చేసి వీడియోలో ఆజెక్టును రీమూవ్ చేసుకోవచ్చు. ఈ వెబ్సైటులో వీడియో ఎడిటింగ్ కి సంబందించిన చాల ఆప్షన్స్ ఉన్నాయి.
అలాగే మరొక టూల్ ఇందులో ఒక టెక్స్ట్ ని వీడియో గా కన్వెర్ట్ చేసుకోవచ్చు. అది కూడా మనకి నచ్చిన పేస్, వాయిస్ తో పాటు..
దీని కోసం గూగుల్ లో d-id studio అని సెర్చ్ చేయండి లేదా https://studio.d-id.com/ అనే వెబ్సైటు ఓపెన్ చేసి ఇందులో గూగుల్ అకౌంట్ ద్వారా లాగిన్ అయి అందులో మనమిచ్చిన టెక్స్ట్ ని వెబ్సైటులో ఇచ్చిన మనకు నచ్చిన పర్సన్ ను ఉపయోగించి వీడియో గా మార్చుకోవచ్చు. ఇంకా ఇందులో అప్లోడ్ ఫోటో ఆప్షన్ లోకి వెళ్లి మనకు నచ్చిన పర్సన్ ఫోటో అందులో అప్లోడ్ చేసి కూడా వీడియో తయారు చేసుకోవచ్చు.
అలాగే చివరగా మరొక టూల్ ఇందులో ఏంచేయవచ్చు అనే దానికన్నా ఏంచేయలేము అనడమే మంచిదేమో, ఎదుకంటే ఈ AI వెబ్ సైట్ లో అనేక వీడియో టూల్స్, ఆడియో టూల్స్, PDF టూల్స్, కన్వెర్టర్ టూల్స్, యుటిలిటీ టూల్స్ ఉన్నాయి. వీటిని ఉపయోగించి మన వర్క్ ను చాల సులభతరం చేసుకోవచ్చు.
దీని కోసం గూగుల్ లో 123apps అని సెర్చ్ చేయండి లేదా https://123apps.com/ అనే వెబ్సైటు ఓపెన్ చేసి మనకు నచ్చినట్టుగా మన ఫైల్స్ ను మార్చుకోవచ్చు.
ఇలాంటి మరిన్ని వాటి కొరకు తెలుగు రీడర్స్ టెక్నాలజీ ను సందర్శించండి.