Home » పవిత్ర జ్యోతిర్లింగ కాశీ విశ్వనాథ్ ఆలయ పర్యటన

పవిత్ర జ్యోతిర్లింగ కాశీ విశ్వనాథ్ ఆలయ పర్యటన

by Lakshmi Guradasi
0 comment

పవిత్ర జ్యోతిర్లింగామైన కాశీ కి వెళ్లాలనుకుంటున్నారా అయితే ఈ విషయాలను మీరు తప్పక తెలుసుకోవాలి. ద్వాదశ జ్యోతిర్లిగాలలో ఒకటైన విశ్వనాథ ఆలయం, మరియు అష్ట దశ శక్తీ పీఠాలలో ఒకటైన విశాలాక్షి అమ్మవారి ఆలయం,కాశీ క్షేత్రం లోనే కొలువై ఉన్నాయి. అందువలనే హిందువులకు అత్యంత పవిత్రమైన పుణ్య క్షేత్రం అయింది. ఇక్కడ లింగానికి స్వయంగా మనమే గంగా జలంతో అభిషేకించవచ్చు. ఇది ఉత్తరప్రదేశ్ రాష్ట్రం లో ఉంది. వరుణ, హసి అనే రెండు నదులు గంగా నదిలో కలవడం వలన వారణాసి అనే పేరు వచ్చింది. ఈ నగరానికి మందిరాల నగరం, దీపాల నగరం, విద్య నగరం అనే వివిధ పేర్లు కూడా ఉన్నాయి. జీవితంలో ఒకసారైనా కాశీ కి వెళ్లాలని ప్రతి ఒక్కరు అనుకుంటారు. కాని ఆ ప్రాప్తం కొంతమందికే దక్కుతుంది. 

things to know while visiting kashi vishwanath temple

పురాణం:

పూర్వం బ్రహ్మ దేవుడు సృష్టి మొదలపెట్టడానికి ముందు తపస్సు చేయడానికి చోటును వెతుకుతునప్పుడు. శివుడు తన త్రిశులం తో సృష్టించిన చోటే ఈ కాశీ. మీరు సరిగ్గా గమనిస్తే ప్రాచీన హిందూ గ్రంథాల్లో, ముఖ్యంగా స్కంద పురాణం, రిగ్వేదం మరియు మహాభారతం, వంటి వాటిలలో కాశీ నగరం ప్రసక్తి ఉంది. 

కాశీని ముక్తి క్షేత్రంగా పూజించడం:

కాశీని ముక్తి ప్రసాదించే క్షేత్రంగా కొనియాడతారు. దాని ప్రాముఖ్యత ఏమిటంటే ఇది శివుడు స్థాపించిన నగరం కాబ్బటి, ఇక్కడ తనువు చాలిస్తే మోక్షం పొంది స్వర్గానికి వెళతారని నమ్మకం. అందువలనే మరణించిన వారి శవాలు రోజు ఘాట్ లా వద్ద చితి పెట్టి కాలుస్తుంటారు. ఉత్తర దిశగా ప్రవహించే గంగా నదిలో మొత్తం 84 ఘాట్లు (స్నాన ఘాట్లు, స్మశాన ఘాట్లు) ఉన్నాయి. ఇక్కడ స్నానం చేస్తే పునర్జన్మ నుండి విముక్తి చెందుతారని భక్తుల విశ్వాసం. ప్రధానంగా సాయంత్రం వేళలో, గంగమ్మ తల్లికి ఇచ్చే హారతి ఇక్కడున్న ప్రత్యకతలలో ఒకటి. 

things to know while visiting kashi vishwanath temple

వారణాసి విశిష్టతలు (Varanasi significance):

కాశీ నగరం మన హిందువులకే కాకుండా బౌద్ధులకు, జైనులకు కూడా పుణ్య క్షేత్రమే. వారణాసి లో కాశీ విశ్వ విద్యాలయం ప్రముఖ విద్యాలయం గా పేరు గాంచింది. దానితో పాటు హిందుస్థానీ సంగీతం, పట్టు వస్త్రాల నేత, సంస్కృత పండితుల పీఠం ఇలా ఎన్నో విశిష్టతలను కలబోసుకుని విరాజిల్లుతుంది. 

కాశీ లో నివసించిన ప్రముఖులు:

విశ్వమిత్ర మహర్షి పరిక్షకు నిలబడి హరిశ్చంద్రుడు తన నిజాయితీ లోకానికి చాటి చెప్పింది ఈ వారణాసి లో నివసించే. అలాగే గౌతమ బుద్ధుడుకు గ్యానోదయం అయ్యాక తన మొదటి ఉపదేశం ఇచ్చింది, కాశీ లోని సారనాథ్ పట్టణం లోనే. మరియు కబీర్ దాస్ వంటి ప్రముఖులు జన్మించింది కాశీ లోనే. 

ముస్లిం పాలకుల కాలం: 

ఇస్లామిక్ పాలకుల కాలంలో ముఖ్యంగా ఔరంగజేబు అనే రాజు కాశీని ఆక్రమించి, హిందూ దేవాలయాలు కూల్చివేసి, మసీదులను నిర్మించాడు. ఈ క్రమంలో చాలా కాలం పాటు కాశీ ఒక రాజకీయ సమస్యగా మారింది. 

కాశీ లోని వింతలు ( Kashi Temple Facts ):

కాశీలో కొన్ని వింతలు కూడా చోటు చేసుకున్నాయి అవి ఏమిటంటే కాశీ ప్రాగణంలో గ్రద్దలు ఎగరావు, అలాగే గోవులు పొడవవు, బల్లులు చప్పుడు చేయవు, శవాలు కూడా వాసన రావు, మరియు కాశీలో చనిపోయిన ప్రతి జివి కుడి చెవి పైకి లేచి ఉంటుంది. ఉదయాన్నే ఆలయంలో జరిగే మొదటి పూజ శవ భస్మంతోనే ప్రారంభిస్తారు. ఆలయంలో శివునికి అభిషేకించిన భక్తుల చేతుల రేకలు మారిపోతాయని అంటూ ఉంటారు. ఇంకో విషయం ఏమిటంటే విశ్వనాథ మందిరం లో ఉన్న నంది ఇప్పటికి, కూల్చ బడిన గ్యాన వాపి తీర్ధం బావి వైపు చూస్తూ ఉన్నట్టు కనిపిస్తుంది. ఇవి కాశీలోని మహాత్యములు. 

things to know while visiting kashi vishwanath temple

కాశీ విశ్వనాథుని దర్శన సమయాలు (Kashi Vishwanath darshan ):

మంగళ హారతి: 3:00 AM నుండి 4:00 AM వరకు
భోగ్ హారతి: ఉదయం 11:15 నుండి మధ్యాహ్నం 12:20 వరకు
సప్త ఋషి హారతి: 7:00 PM నుండి 8:15 PM వరకు
శృంగార్ హారతి: 9:00 PM నుండి 10:15 PM వరకు
శయన ఆరతి: రాత్రి 10:30 నుండి 11:00 వరకు

కాశీలో చూడదగ్గ ప్రదేశాలు ( Places to visit in Kashi ) : 

కాశీ విశ్వనాథ ఆలయం, విశాలాక్షీ ఆలయం, అన్నపూర్ణ దేవి మందిరం, మంకార్నికా దేవాలయం, సంకట మోచన్ హనుమాన్ మందిరం, తులసీ మనస మందిరం, దుర్గా మందిరం, న్యూకాల భైరవ మందిరం, న్యూకాల భైరవ మందిరం, భారతమాత మందిరం, సంకట మోచన్ వినాయక దేవాలయం. 

విశ్వనాథ్ ఆలయానికి చేరుకోవడం ( How to Reach Vishwanath Temple ):

ఢిల్లీ నుండి 8 వందల కిలో మీటర్లు, కోల్కత్త నుండి 7 వందల కిలో మీటర్లలలో ఉంది. సమీప విమానాశ్రయం లాల్ బహదూర్ శాస్త్రి అంతర్జాతీయ విమానాశ్రయం , కాశీ విశ్వనాథ దేవాలయం నుండి 25 కి.మీ.

విశ్వనాథ్ ఆలయ రూట్ మ్యాప్ లొకేషన్ (Viswanath Temple Route Map Location)

ఇటువంటి మరిన్ని ఆలయాల సమాచారం కోసం తెలుగు రీడర్స్ విహారి ను చూడండి.

You may also like

Leave a Comment