67
‘భారతీయుడు 2’ చిత్రాన్ని రెండు భాగాలుగా తీయడానికి కారణం ఏమిటో దర్శకుడు శంకర్ వివరించారు. కమల్ హాసన్ ప్రధాన పాత్రలో శంకర్ డైరెక్షన్లో వచ్చే నెల 12న రానున్న సినిమా ‘భారతీయుడు 2’. ‘భారతీయుడు’కి కొనసాగింపుగా వస్తున్న 2 సీక్వెల్స్‌లో ఇది మొదటిది. దీన్ని 2 భాగాలుగా తీయడం వెనుక కారణాన్ని శంకర్ ఓ ఇంటర్వ్యూలో తెలిపారు. ‘సీక్వెల్‌ను ఒక పార్ట్‌గానే తీయాలనుకున్నాం. షూటింగ్ పూర్తయ్యాక చూస్తే ప్రతి సీన్ అద్భుతంగానే ఉంది. ఏ సీన్‌నూ తొలగించలేం. అందుకే 2 పార్టులుగా తెస్తున్నాం’ అని చెప్పారు.
ఇలాంటి మరిన్ని వాటి కొరకు తెలుగు రీడర్స్ వార్తలు ను సందర్శించండి.