71
AP: ఆర్బీఐ ఆదేశాల ప్రకారం ఫోన్ పే, గూగుల్ పే, పేటీఎం, అమెజాన్ పే నుంచి బ్యాంకులు విద్యుత్ బిల్లులు స్వీకరించడం నిలివేశాయని పేర్కొంది. వినియోగదారులు చెల్లింపులు చేయడంలో సమస్యలను ఎదుర్కోకుండా ఉండేందుకు, సమస్యను వీలైనంత త్వరగా పరిష్కరించాల్సిందిగా UPIను కోరింది. ఈ యాప్ల ద్వారా కరెంట్ బిల్లులు <<13544824>>చెల్లించే <<>>సేవలు నిలిచిపోయాయి. ఇప్పటికే క్రెడిట్ కార్డు ద్వారా బిల్లుల చెల్లింపులను ఆ యాప్లు నిలిపివేశాయి. ఇకపై ఆయా డిస్కంల వెబ్సైట్లు, మొబైల్ యాప్లను వినియోగించి బిల్లులు కట్టాలి. ఉమ్మడి కృష్ణా, గుంటూరు, ప్రకాశం జిల్లాల వారు సెంట్రల్ పవర్, ఉమ్మడి గోదావరి జిల్లాలు, VZM, విశాఖ, శ్రీకాకుళం జిల్లాల వారు ఈస్ట్రన్ పవర్, మిగతా వారు సదరన్ పవర్ యాప్లు వాడాలి.
ఇలాంటి మరిన్ని వాటి కొరకుతెలుగు రీడర్స్ వార్తలును సందర్శించండి.